Sony Smartphone: సోనీ నుంచి అద్దిరిపోయే ఫీచర్లతో Sony Xperia 1 VIలాంచ్, ధర, ఫీచర్లు ఇలా

Sony Smartphone: ప్రముఖ టెక్ ఉత్పత్తుల కంపెనీ సోనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Sony Xperia నుంచి Sony Xperia 1 VI లాంచ్ అయింది. చాలాకాలంగా స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయని సోనీ నుంచి కొత్త మోడల్ రావడంతో మార్కెట్‌లో ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 15, 2024, 04:15 PM IST
Sony Smartphone: సోనీ నుంచి అద్దిరిపోయే ఫీచర్లతో Sony Xperia 1 VIలాంచ్, ధర, ఫీచర్లు ఇలా

Sony Smartphone: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ సోనీ నుంచి కొత్తగా సోనీ ఎక్స్‌పీరియా 1 లాంచ్ అయినట్టు కంపెనీ ప్రకటించింది. ఏకంగా 12 జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ కెమేరా కూడా అద్భుతంగా ఉండనుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం.

Sony Xperia 1 VI ఫోన్ అనేది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్పీటీవో డిస్‌ప్లే కలిగి 4కే రిజల్యూషన్‌తో ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. స్టీమ్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థ ఉంటుంది. ఫుల్ హెచ్‌డి ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సెక్యూరిటీ ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రోసెసర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 4 ఏళ్ళపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతుంటాయి. ఇందులో డ్యూయల్ సిమ్ ఏర్పాటు ఉంటుంది. Sony Xperia 1 VIలో 52 మెగాపిక్సెల్ కెమేరాతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలీఫోటో కెమేరా మరో ప్రత్యేకత. ఈ ఫోన్‌లో ఉండే బ్యాక్ కెమేరా స్కెలెటన్ గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వినియోగిస్తుంది. ఇక ఇందులో ఫుల్ స్టేజ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. సోనీ కంపెనీకు చెందిన 360 రియాలిటీ ఆడియోతో పాటు సోనీ పిక్చర్స్‌కు చెందిన డాల్బీ  అట్మోస్ సౌండ్ ట్యూనింగ్ ఉంటుంది. యాంటీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది. 

ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఉంటుంది. మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా 1.5 టీబీ వరకూ పొడిగించవచ్చు. Sony Xperia 1 VI ధర దాదాపుగా 1,26,500 రూపాయలుండవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ ఆర్డర్ చేసేందుకు ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, ప్లాటినం, సిల్వర్, మిలట్రీ గ్రీన్ రంగుల్లో లబించనుంది. 

Also read: Anand Mahindra Love Story: ఆనంద్ మహీంద్రా భార్య ఎవరో తెలుసా..! లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News