vivo T3 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G మొబైల్‌పై బంఫర్‌ ఆఫర్.. ఏకంగా అంత డిస్కౌంటా?

vivo T3 Pro 5G Price Drop: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ని కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ లభించబోతోంది. అయితే దీనిపై ఉన్న డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 1, 2024, 03:35 PM IST
vivo T3 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G మొబైల్‌పై బంఫర్‌ ఆఫర్.. ఏకంగా అంత డిస్కౌంటా?

vivo T3 Pro 5G Price Drop: సెప్టెంబర్ నెలలో అనేక చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సంబంధించిన మొబైల్స్ విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా ఇదే నెలలో చాలావరకు గతంలో విడుదలైన మొబైల్స్ కు సంబంధించిన సేల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొత్త మొబైల్ మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఇది అత్యధిక తగ్గింపుతో సరసమైన ధరలు లభించబోతోంది. అంతేకాకుండా మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఫ్లిఫ్‌కార్ట్‌ అద్భుతమైన ఆఫర్స్ ను కూడా అందిస్తోంది ముఖ్యంగా ఊహించని ఎక్స్చేంజ్ బోనస్తోపాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఇంతకీ ఈ మొదటి వారంలో ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చే కొత్త మొబైల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

సెప్టెంబర్ మూడవ తేదీన ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఇటీవలే విడుదల చేసిన vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. దీని మొదటి సెల్ లో భాగంగా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ స్టోరేజ్ వేరియట్స్‌లో లభించనుంది. అలాగే ఇందులోని బేస్ వేరియంట్ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. వివో కంపెనీ ఈ మొబైల్ ను మార్కెట్ ధర రూ.29,000 విడుదల చేయగా దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి 16% పైగా తగ్గింపు లభిస్తుంది. 

దీంతో ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం ఈ మొబైల్ రూ. 24,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఆదనంగా దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ ని కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్ లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి ఐదు శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే దీనిని యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఈ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా భారీ డిస్కౌంట్ లభించబోతోంది. అంతేకాకుండా అదనంగా రూ.2,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ అందుబాటులో ఉంచింది.

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ప్రాసెసర్: MediaTek Dimensity 8100-Max 5G
ఆపరేటింగ్ సిస్టమ్: Android 12 (Funtouch OS 12)
6.67-inch AMOLED డిస్ప్లే
రెజల్యూషన్: Full HD+ (2400 x 1080)
రేఫ్రెష్ రేటు: 120Hz
రియర్ కెమెరాలు: 64MP ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా + 2MP మాక్రో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16MP
స్టోరేజ్: 8GB/12GB
సామర్థ్యం: 4700mAh
ఛార్జింగ్: 66W ఫ్లాష్‌ఛార్జ్
కనెక్టివిటీ: 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB-C
ఫింగర్‌ప్రింట్ సెన్సార్: ఇన్-డిస్ప్లే
స్పీకర్లు: స్టీరియో స్పీకర్లు

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News