Vivo Y22: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉందా..అయితే వివో నుంచి ఆకర్షించే డిజైన్, అద్భుత ఫీచర్లతో బడ్జెట్ ఫోన్ లాంచ్ అయింది. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇది..
చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివోకు ఇండియాలో ఆదరణ ఎక్కువ. వివో స్మార్ట్‌ఫోన్ అంటే చాలామందికి ఇష్టముంటుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ వరకూ అన్నీ అందుబాటులో ఉంటాయి. వివో ఇప్పుడు మరో కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y22ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఎందుకంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ అది. బ్యాటరీ సామర్ధ్యం కూడా ఎక్కువే. ఇంకా చాలా మంచి మంచి ఫీచర్లున్నాయి. వివో ప్రత్యేకతలు, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Vivo Y22 ఇండియాలో లాంచ్ అయింది. ఇప్పుడు విక్రయాలు కూడా జరుగుతున్నాయి. వై సిరీస్ స్మార్ట్‌ఫోన్లో వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, రెక్టాంగ్యులర్ మాడ్యూల్‌లో డ్యూయల్ కెమేరా సెన్సార్‌తో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, మెటావర్స్ గ్రీన్‌లో లభ్యమౌతుంది.
Vivo Y22 ధర
వివో వై22 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 14,499 రూపాయలుగా ఉంది. ఎస్బీఐ, కొటక్, వన్ క్రెడిట్ కార్డ్స్‌తో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే..750 రూపాయలు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది.
Vivo Y22 ఫీచర్లు
Vivo Y22 స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ 2.5 డిస్‌ప్లే, 530 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, బ్లూ లైట్ ఫిల్టర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. 4జి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ఎంటి 6769 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్, రెండవ సెన్సార్ 2 మెగాపిక్సెల్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాల్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
Also read: LPG Gas Cylinder Price: గ్యాస్ సిలెండర్‌పై 300 రూపాయల డిస్కౌంట్, ఎలాగో తెలుసుకుందాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook