Whatsapp Latest Tricks: వాట్సాప్‌లో ఈ సెట్టింగ్‌ ఆన్ చేస్తే హ్యాకర్ల నుంచి మీ డాటాను కాపాడుకోవచ్చు..!

Whatsapp Phone Memory Management: వాట్సాప్‌లో  స్టోరేజ్ ఫుల్ అని కనిపిస్తుందా? అయితే వెంటనే ఈ ఆప్షన్‌ను ఆన్‌ చేయండి. మీ ఫోన్‌లో ఎప్పటికి స్టోరేజ్‌ ప్రాబ్లమ్ ఉండదు. ఈ సెట్టింగ్‌ ఎలా ఆన్‌ చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 14, 2024, 05:04 PM IST
Whatsapp Latest Tricks: వాట్సాప్‌లో ఈ సెట్టింగ్‌ ఆన్ చేస్తే హ్యాకర్ల నుంచి మీ డాటాను కాపాడుకోవచ్చు..!

Whatsapp Phone Memory Management: వాట్సాప్ మన దినచర్యలో ఒక భాగమైనది. ఇందులో మనం ఫొటోలను, వీడియోలను సులువుగా పంపించుకోవచ్చు అలాగే వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు కూడా.  అయితే కొన్ని సార్లు ఫోన్‌ మెమెరీ ఫుల్‌ అవుతుంది. ఫోన్‌లో తెలియకుండానే వాట్సాప్‌లో ఉండే ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్‌ అయిపోతున్నాయా? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ను ఫాలో అవ్వండి. 

మన ప్రతిరోజు వాట్సాప్‌లో ఫొటోలను, వీడియోలు వస్తుంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసి చూసి లైట్‌ తీసుకుంటాము. అలాగే మనం ఇతురలకు వీడియోలు పంపిస్తుంటాం ఆ తరువాత పెద్దగా పట్టించుకోము. కానీ ఈ వీడియోలు, ఫొటోలు వాట్సాప్ ఇంటర్‌నల్‌ మెమెరి స్టోర్‌లో సేవ్‌ అవుతాయని చాలా మందికి  తెలియదు.  దీని కారణంగా వాట్సాప్‌ స్టోరేజ్‌ ఫుల్‌ అయిపోతుంది. స్టోరేజ్‌ ఫుల్‌ అవ్వకుండా ఉండాలంటే ఈ ఒక సెట్టింగ్‌ ను ఆన్‌ చేస్తే సరిపోతుంది. 

 స్టోరేజ్‌ సెట్టింగ్‌ ఎలా ఆన్‌ చేయాలి? 

వాట్సాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్‌ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి. ఆ తరువాత స్టోరేజ్ మీద క్లిక్‌ చేయండి. ఇక్కడ మేనేజ్‌ స్టోరేజ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని మీద క్లిక్‌ చేస్తే మీకు ఫోన్‌లో ఉండే స్టోరేజ్‌ మొత్తం కనిపిస్తుంది. ఇందులో మీకు అవసరం లేని చాట్‌ను, ఫొటోలను, వీడియోలను డిలిట్‌ చేసుకోవచ్చు. దీని వల్ల స్టోరేజ్‌ సమస్య తగ్గుతుంది. 

ఇప్పుడు ఈ ట్రిక్ గురించి తెలుస్తే షాక్ అవుతారు. ప్రస్తుతకాలంలో చాలా మంది హ్యాకర్లలు వాట్సాప్‌లో మన పర్సనల్ డేటాను దొంగలిస్తుంటారు. దీని వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. హ్యాకర్లు మన డేటాను దొంగలించి డబ్బులు డిమాండ్‌ చేయడం లేదా ఇతర కంపెనీలకు అమ్ముకోవడం చేస్తుంటారు. ఈ సమస్యలో చిక్కుకోకుండా ఉండాలంటే వాట్సాప్‌లో ఉండే ఈ ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోవడం చాలా మంచిదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఆప్షన్‌ను ఎలా వినియోగించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 

ముందుగా వాట్సాప్‌ సెట్టింగ్స్‌ను ఓపెన్‌ చేసి అందులో ఉండే ప్రైవసీ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అందులో అడ్వాన్స్‌డ్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దీని పై క్లిక్ చేసిన తరువాత పొటెక్ట్‌ ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌, డిసేబుల్‌ లింక్‌ ప్రివ్యూస్‌ అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి. ఇందులో ఆ రెండింటినీ ఆన్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌ చేయడం వల్ల మీ ఫోన్ ఐపీ అడ్రస్‌ను హ్యాకర్లు కనిపెట్టలేరు. అలాగే మాల్వేర్‌ లాంటి వైరస్‌లు కూడా పంపలేరు. కాబట్టి మీరు కూడా ఈ ఆప్షన్‌లను ఆన్‌ చేసుకోవడం చాలా మంచిది. 

ఇదీ చదవండి: Whatsapp Like Feature Update: ఇప్పుడు వాట్సాప్‌లో కూడా లైక్‌ ఫీచర్‌! ఎలా పనిచేస్తుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News