Wifi Router Precautions: మొబైల్ డేటాకు సమాంతరంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ అవసరం పెరిగిందనే కంటే ఇంటర్నెట్‌పై ఆధారపడటం ఎక్కువైందని చెప్పాలి. అందుకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు, రూటర్ సదుపాయం అధికమైంది. రాత్రి వేళల్లో రూటర్ ఆన్ చేసి ఉంచుతున్నారా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.
సాధారణంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందే ఇళ్లలో రూటర్ తప్పకుండా ఉంటుంది. నూటికి 98 శాతం మంది రూటర్‌ను 24 గంటలూ ఆన్‌లోనే ఉంచుతుంటారు. అంటే రాత్రి వేళల్లో కూడా రూటర్ ఆన్‌లో ఉండే పరిస్థితి. బ్రాడ్‌బ్యాండ్ ధరలు కూడా తగ్గడంతో కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ డివైజ్ కనెక్షన్ల కోసం వైఫై సామాన్యమైపోయింది. అయితే 24 గంటలూ ముఖ్యంగా రాత్రి వేళ రూటర్ ఆన్‌లో ఉంచడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యపరంగా, సైబర్ నేరాల పరంగా ఇది రిస్క్ అంటున్నారు.
ఇంటర్నెట్ అవసరం లేనప్పుడు ముఖ్యంగా రాత్రివేళ పడుకునేటప్పుడు రూటర్‌ను ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు. లేకపోతే ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వైఫై నెట్‌వర్క్ ఎప్పుడూ విద్యుత్ అయస్కాంత ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు అంతరాయం కల్గిస్తుంది. ఫలితంగా అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో వైఫై ఆన్ చేయకపోతే..నిద్రపోకుండా మొబైల్ ఫోన్‌తో కాలక్షేపం చేయడం ఫలితంగా నిద్రలేమి సమస్య ఏర్పడటం ఉంటుందంటున్నారు.
వైఫై ఆఫ్ చేస్తే త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశముంటుందని..ఇది ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా...రూటర్ రాత్రి పూట ఆన్ చేసి ఉంచడం వల్ల హ్యాకింగ్ సమస్య ఏర్పడవచ్చంటున్నారు.
Also read: Cancer Signs: కేన్సర్‌ను సకాలంలో ఎలా గుర్తించడం, ఎందుకు ప్రాణాంతకమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook