గురుకులాల్లో 400 పోస్టుల భర్తీకి అనుమతి

నిరుద్యోగులకు శుభవార్త.

Last Updated : Jun 25, 2018, 04:55 PM IST
గురుకులాల్లో 400 పోస్టుల భర్తీకి అనుమతి

నిరుద్యోగులకు శుభవార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యమో.. ఏమో గానీ ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల నియామకాలకు చర్యలు చేపట్టింది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల్లో 400 పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. 175 జూనియర్ లెక్చరర్స్, 100 టీజీటీ, 50 పీజీటీ, 50 లైబ్రేరియన్స్, 25 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. త్వరలోనే వీటి భర్తీకి అధికారిక ప్రకటన వెలువడనుంది. దరఖాస్తుకు ఫీజు, పరీక్షా తేదీలు, ఫలితాల తేదీలు, సిలబస్ తదితర వివరాలన్నీ నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. ఈ పోస్టుల భర్తీ గురుకుల నియామక బోర్డు ద్వారా జరగనుందని తెలిసింది.

బలహీన వర్గాల, మైనారిటీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అన్ని సౌకర్యాలతో అందించేవి గురుకుల విద్యాలయాలు. అధిక జీతభత్యాలు, సమాజంలో గౌరవప్రదమైన వృత్తికావడం వల్లనూ, బి.ఇడి ఉత్తీర్ణులు ఎక్కువమంది ఉండడం వల్లనూ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడే అవకాశం ఉంది. ప్లాన్ చేసుకొని చదివితే విజయం మీదే అవుతుంది.

Trending News