ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహిళా అధికారి

తాను కొన్న భూమికి పట్టా చేయాలన్న దరఖాస్తు నాలుగేళ్లుగా అలాగే ఉండటంతో అధికారిని కలిశాడు ఆ రైతు. రూ.13 లక్షలు డిమాండ్ చేయగా, రూ.10 లక్షలు ఇచ్చుకుంటానని డీల్ కుదుర్చుకుని ఏసీబీకి పట్టించాడు.

Last Updated : Feb 25, 2020, 09:05 AM IST
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహిళా అధికారి

నాగర్‌కర్నూలు: ఏసీబీ అధికారులకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఏకంగా కలెక్టర్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ డిప్యూటీ ఎమ్మార్వో అడ్డంగా దొరికిపోవడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన రైతు దోమ వెంకటయ్య 2016లో 2.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పట్టామార్పిడి కోసం అప్పట్లోనే తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆ భూమి తనదని, గతంలోనే తాను కొన్నానని పట్టా మార్పిడి చేయవద్దని ఫిర్యాదు చేశాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి

నాలుగేళ్లు గడుస్తున్నా తన సమస్య పరిష్కారం కావడం లేదని కలెక్టరేట్‌లో పనిచేస్తున్న డిప్యూటీ ఎమ్మార్వో జయలక్ష్మిని కలిశారు. రూ.13 లక్షలు చెల్లిస్తే పట్టా వెంకటయ్య పేరున చేయించి వివాదాన్ని పరిష్కరిస్తానని రైతుకు చెప్పారు. చివరికి రూ.10 లక్షలకు డీల్ కుదిరింది. అయితే విడతలవారీగా నగదు చెల్లిస్తానని చెప్పిన వెంకటయ్య ఏసీబీ అధికారులను సంప్రదించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌కు వచ్చిన వెంకటయ్య ఉప తహసీల్దారు జయలక్ష్మికి లక్ష రూపాయలు లంచం ఇచ్చారు. రైతు నుంచి ముందుగానే సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఆమె పట్టుకున్నారు. ఆమె ఇళ్లు, ఇతర ఆస్తులపై సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News