Murali mohan: హైడ్రా కూల్చివేత నోటీసులు.. మురళీమోహన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

Murali mohan on hydra notice: హైడ్రా.. నటుడు మురళి మోహన్ అక్రమ నిర్మాణాలపై తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని జయభేరీకి చెందిన సంస్థలో అక్రమ కట్టాడాలు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 8, 2024, 01:02 PM IST
  • జె కన్వెన్షన్ కు హైడ్రా నోటీసులు..
  • క్లారిటీ ఇచ్చిన నటుడు..
Murali mohan: హైడ్రా కూల్చివేత నోటీసులు.. మురళీమోహన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

Tdp ex mp murali mohan on hydra notice: తెలంగాణలో హైడ్రా హల్ చల్ కొనసాగుతుంది.  చెరువులు, కాలువల దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాలు , కట్టడాలని హైడ్రా  కూల్చివేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువుల బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించుకుని ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణలో హైడ్రా కాన్సెప్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున ఎన్న కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా.. పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.

ముఖ్యంగా అక్రమ కట్టడాలు, నిర్మాణాలు చేపట్టిన వారికి హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రా మరోసారి తన దూకుడు పెంచింది. తాజాగా.. నటుడు, టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మురళి మోహన్ కు హైడ్రా నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయన తాజాగా స్పందించారు.

పూర్తి వివరాలు..

హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు.. అక్రమ నిర్మాణ దారులు, తెగ టెన్షన్ లను పడిపోతున్నారు. తాజాగా, హైడ్రా.. మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీన్ పూర్ లలో ఏకకాలంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది.  అదే విధంగా.. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం చేపట్టింది. స్థానిక పోలీసుల సహాయంతో బందోబస్తు చేపట్టి.. మరీ కూల్చివేతలు చేపట్టింది.

ఇదిలా ఉండగా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న.. జయభేరీ కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా (HYDRAA) నోటీసులు జారీ చేసింది. నటుడు మురళి మోహన్ చెందిన కొన్ని నిర్మాణాలు గచ్చిబౌలి లోని రంగలాల్ కుంట చెరువులో.. బఫర్ జోన్, ఎప్టీఎల్ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌) పరిధిలో ఉన్నట్లు హైడ్రా గుర్తించి నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వీటిని కూల్చివేయాలని, లేకుండాతామే కూల్చేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నోటీసులు జారీచేశారు.

Read more: Ganesh Chaturthi 2024: వావ్.. గణపయ్య విగ్రహాల ముందు లేడీ పోలీస్ ల మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్.. 

ఈ క్రమంలో దీనిపై స్పందించిన మురళిమోహన్.. తాను గత 35 ఏళ్లుగా..రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్‌లో మూడు అడుగుల మేరకు.. రేకుల షెడ్డు ఉన్నట్టు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఆ రేకుల షెడ్డును మేమే తొలగించేస్తాం.. హైడ్రానే రానక్కర్లేద నిచెప్పారు. రెండ్రోజుల్లో (మంగళవారం లోపు) తాత్కాలిక షెడ్డును తొలగిస్తామని మురళీ మోహన్ వెల్లడించారు.

 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News