హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా తబ్లిగీ జమాత్ మత ప్రార్థనల కరోనా కేసులుకలకలం రేపడం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులను ఎంత డీల్ చేస్తున్నా కొత్త కేసులు పుట్టుకొచ్చి అధికారులకు చిరాకు తెప్పిస్తున్న క్రమంలో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఢిల్లీ మర్కజ్‌తో పాటు మరో దర్గాకు వెళ్లివచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావడం తెలంగాణలో హల్చల్ చేస్తోంది. ఆ దర్గాకు వెళ్లొచ్చిన వారు ఎంత మంది, వారు ఎవరెవరిని కలిశారన్న దానిపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. నరికేసిన పోలీసు చేతిని మళ్లీ అతికించిన డాక్టర్లు
ఉత్తర్‌ప్రదేశ్ దేవ్‌బంద్ దర్గాలో మత ప్రార్థనలకు వెళ్లిన వారిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. నిన్న (ఏప్రిల్ 12న) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ తరహాలోనే యూపీలోని దేవ్‌బంద్ దర్గాలోనూ ప్రార్థనలు జరిగాయి. మరోవైపు నిజాముద్దీన్ వెళ్లిన వారు యూపీలోని దేవ్‌బంద్, రాజస్థాన్ అజ్మీర్ దర్గాను సైతం సందర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు కరోనా టెస్టులకు సొంతంగా ముందుకు రాని కారణంగా ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 269, 270, 271, సెక్షన్-3, ఎపిడమిక్ యాక్ట్ 1897తో పాటు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 సెక్షన్ 54 కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos