GHMC Election 2020 Counting: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ( Ghmc Elections ) ఇక చిట్ట చివరి అంకం మిగిలింది. రేపు అంటే డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపధ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జీహెచ్ఎంసీ కౌంటింగ్ ( Ghmc counting ) డిసెంబర్ 4 న అంటే రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. జీహెచ్ఎంసీ కౌంటింగ్ కోసం 30 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఇందులో 166 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్ కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్స్ ఉంటాయి.
మొత్తం 150 డివిజన్లకు ( 150 Divisions ) జరిగిన ఎన్నికకు సంబంధించి 1122 మంది అభ్యర్ధుల భవితవ్యం రేపు తేలనుంది. కౌంటింగ్ సందర్భంగా నిబంధనలు ఆంక్షల్ని జారీ చేసింది ఎన్నికల సంఘం. పాస్ ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లో అనుమతి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్ అనుమతి లేదు. అన్ని కేంద్రాల్లోనూ వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమేరాల్ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల పరిశీలకుడి అనుమతి తరువాతే ఫలితాల్ని అధికారికంగా వెల్లడిస్తారు. అనుమానిత ఓట్లపై రిటర్నింగ్ అధికారి ( Returning officer )దే తుది నిర్ణయముంటుంది. రీ కౌంటింగ్ అవసరమని భావిస్తే..ఫలితాల ప్రకటనకు ముందే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఇద్దరికి సమాన ఓట్లు లభిస్తే..లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. Also read: Double Decker buses: హైదరాబాద్ వీధుల్లో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు