Double Decker buses: హైదరాబాద్ వీధుల్లో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు

Double Decker buses: గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగెట్టనున్నాయి. ఓ వ్యక్తి చేసిన ట్వీట్..మంత్రి కేటీఆర్ సూచనతో అధికారులు సిద్ధమయ్యారు. బస్సుల కొనుగోలుకు రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

Last Updated : Dec 3, 2020, 07:52 PM IST
  • 2004లో చివరి సారిగా జంటనగరాల్లో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులు
  • 16 ఏళ్ల తరువాత..త్వరలో నడిపేందుకు రంగం సిద్ధం
  • 5 మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనున్న రవాణా శాఖ
Double Decker buses: హైదరాబాద్ వీధుల్లో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు

Double Decker buses: గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగెట్టనున్నాయి. ఓ వ్యక్తి చేసిన ట్వీట్..మంత్రి కేటీఆర్ సూచనతో అధికారులు సిద్ధమయ్యారు. బస్సుల కొనుగోలుకు రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

జంట నగరాల్లో ( Twin Cities ) ఒకప్పుడు అంటే దాదాపు 16 ఏళ్లకు ముందు డబుల్ డెక్కర్ సిటీ బస్సులు ( Double Decker buses ) చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మళ్లీ 16 ఏళ్ల అనంతరం తిరగనున్నాయి. అక్టోబర్ నెలలో ఇదే విషయమై ఓ వ్యక్తి ట్వీట్ చేయగా..మంత్రి కేటీఆర్ ( Minister KTR ) స్పందించారు. డబుల్ డెక్కర్ బస్సులు నడిపే విషయంపై ఆలోచించమన్నారు. డబుల్ డెక్కర్ బస్సులో తిరిగిన తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 

మంత్రి కేటీఆర్ సూచనతో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Minister Ajay kumar ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇప్పటికే అధికారులు సర్వే పూర్తి చేశారు. సర్వే ప్రకారం 5 మార్గాల్ని డబుల్ డెక్కర్ నడిపేందుకు అనువైనవిగా గుర్తించారు. ఈ మార్గాల్లో తొలిదశలో పది డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనున్నారు. 

ఈ పదహారేళ్ల కాలంలో నగరంలో ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గాలు రావడంతో డబుల్ డెక్కర్ బస్సుల్ని అన్ని ప్రాంతాల్లో నడపడం సాధ్యం కావడం లేదు. 2004లో వీటిని రద్దు చేశారు. ఇప్పుడు నగరం నుంచి పఠాన్ చెరువు వరకూ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్,కోఠి రూట్ లో కూడా తిప్పాలని యోచిస్తున్నారు. అటు మేడ్చల్ రూట్ లో సుచిత్ర, కొంపల్లి వరకూ నడిపే ప్రతిపాదన ఉంది. ఇక చివరిగా పాతబస్తీ నుంచి మెహిదీపట్నం-జీడిమెట్ల నడిపేందుకు ఆలోచిస్తున్నారు. Also read: GHMC Election Bettings: గ్రేటర్ ఫలితాలపై 5 వందల కోట్ల బెట్టింగులు

Trending News