ప్రైవేట్ పాఠశాలలో చదివితే.. మీ పిల్లలకు ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వం! తల్లిదండ్రులకు హెచ్చరిక

Certificates should not given to childrens studying in a private school. ప్రభుత్వ పాఠశాలలో చదవని పిల్లలకు గ్రామ పంచాయతీ తరుపున ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వబడవు అనే కర పత్రాలు చక్కర్లు కొడుతున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 22, 2022, 06:14 PM IST
  • ప్రైవేట్ పాఠశాలలో చదివితే
  • మీ పిల్లలకు ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వం
  • తల్లిదండ్రులకు హెచ్చరిక
ప్రైవేట్ పాఠశాలలో చదివితే.. మీ పిల్లలకు ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వం! తల్లిదండ్రులకు హెచ్చరిక

Certificates should not given to childrens studying in a private school: రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల వైపే గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. కార్పోరేట్ బడులకూ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆధునికీకరణతో విద్యాభోధనలు చెప్పడంతో ప్రభుత్వ బడుల వైపే తొంగి చూసే పరిస్థితి నెలకొంది. ఇందుకు నిలువుటద్దమే మహబూబూబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రామపంచాయతీ వారి పేపర్ ప్రకటనలే నిదర్శనం.

మహబూబూబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రామంలో కరపత్రాలు బయటపడ్డాయి. అవి ఏకంగా ముల్కనూర్ గ్రామపంచాయతీ వారి ప్రకటనలే కావడం విశేషం. అసలు ఆ కర పత్రం ఏముందో ఓసారి చూద్దాం.. 'ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థుల కోసం వచ్చే ప్రయివేటు స్కూల్ వాహనాలు గ్రామంలోకి అనుమతించ బడవు.. మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదవని ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి పిల్లలకు గ్రామ పంచాయతీ తరుపున ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వబడవు' అని ముల్కనూర్ గ్రామంలోని ప్రతి ఇంటికి  కర పత్రాలు తిరుగుతున్నాయి.

మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపనప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే పథకాల లబ్దిని కూడా పొందకూడదనే ముల్కనూర్ గ్రామంలో చెక్కర్లు కొడుతున్న కర పత్రాల సారాంశం. దీనికి గ్రామ ప్రథమ పౌరుడే సాక్ష్యం. ఈ ప్రకటనలతో బడీడు పిల్లలంతా ప్రభుత్వ బడుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రథమ పౌరుడి ప్రయత్నం ఫలించడం దానిని తోడు ఉపాధ్యాయులు సహాకరించడం ముల్కనూర్ గ్రామం ప్రభుత్వంతో కలిసి ముందడుగు వేస్తుందని చెప్పకనే చెప్పొచ్చు.

 

గత కొంతకాలంగా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కారణంగా చాలా మంది తల్లి దండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులుఉన్నారు. ఇక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అందజేస్తున్నారు.  లక్షల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు బాగా ఉపయోగంగా ఉన్నాయి. 

Also Read: David Warner Record: స్టంపౌటైన డేవిడ్ వార్నర్‌‌.. వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో ఆటగాడిగా రికార్డు!

Also Read: Trending Video: కారు బానెట్ కింద ఇరుక్కుపోయిన చిరుత, హార్ట్ టచింగ్ వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News