హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్ధరాత్రి ఓటర్లకు లంచం ఇవ్వజూపే ప్రయత్నం చేశారని ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈమేరకు ఓ ట్వీట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఖాయమని, ఆ అల్లానే అతడిని ఓడిస్తాడని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
INC Nampally candidate went to Hyderabad HC seeking orders to livestream polling processes & deploy Central forces on every booth. At 1 AM today, he was in Banjara Hills trying to bribe voters. Not that it’d have helped him win, his defeat is certain inshallah pic.twitter.com/KcnbY4J6Nb
— Asaduddin Owaisi (@asadowaisi) December 7, 2018
ఇదిలావుంటే, శుక్రవారం ఉదయమే పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే శాస్త్రిపురం పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలోని 317 పోలింగ్ బూత్ వద్ద ఓవైసీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Hyderabad: Asaduddin Owaisi casts his vote at polling booth no. 317 at Mailardevpally, Shastripuram. #TelanganaElections pic.twitter.com/CbQDQFbxjT
— ANI (@ANI) December 7, 2018