Bandi Sanjay Comments: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లికి బండి సంజయ్ ఇండైరెక్ట్ వార్నింగ్

Bandi Sanjay Comments on Ponguleti Srinivas Reddy, Jupalli Krishna Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారిలో పోతుంటే మహిళలు ఇండ్లలోకి పోయి దాచుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీ పోరాటాలకు భయపడి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒక్కటే అని బండి సంజయ్ ఆరోపించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2023, 09:51 AM IST
Bandi Sanjay Comments: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లికి బండి సంజయ్ ఇండైరెక్ట్ వార్నింగ్

Bandi Sanjay Comments on Ponguleti Srinivas Reddy, Jupalli Krishna Rao: బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒక్కటేనని, కాంగ్రెస్ పార్టీని నడిపించేది కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణా రావులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన బండి సంజయ్.. కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నారని.. ఆత్మాభిమానం ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు.  ‘‘మహా జన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా బుధవారం లక్సెట్టిపెటలో జరిగిన మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ బహిరంగ సభకు బండి సంజయ్ తోపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు రఘు, పాయల శంకర్, రాష్ట్ర కార్యదర్వి పల్లె గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, బీజేపీ మీటింగ్ ఉందంటే కేసీఆర్ పెగ్గులేసుకుని టీవీల ముందు కూసుంటడు. మంచిర్యాల ప్రజల్లో మస్త్ జోష్ కన్పిస్తోంది. ఈ జోష్ ఇంకా 5 నెలలు ఉండాలే... కేసీఆర్ అంతు చూద్దాం.. అని పిలుపునిచ్చారు. తెలంగాణ అంతటా తిరుగుతున్నా... బిఆర్ఎస్ మీటింగ్ లకు ఎవరూ రావడం లేదు. ఒక్కొక్కరికి ఫుల్ బాటిల్, వెయ్యి రూపాయలిస్తానన్న రావడం లేదు.. ప్రధాని నరేంద్ర మోదీ పేద కుటుంబం నుండి వచ్చినోడు... పేదల కష్టాలు తెలిసినోడు. పీఎం కాగానే పేదల కష్టాలను తొలగించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నడు. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారు. మరి కేసీఆర్ ఏం చేసిండు? లక్సెట్టిపేటలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా? కొబ్బరికాయ కొట్టడానికే పరిమితమయ్యారు. మందు తాగుతూ మందిని ఎట్లా ముంచాలా? అని ఆలోచిస్తుంటడు అని కేసీఆర్ ని ఎద్దేవా చేశారు.

మోదీ ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే... ఎందుకు కట్టివ్వలేదు.  మంచిర్యాల ప్రజలు చేసిన పాపమేంది ? కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల గల్లా పట్టి అడగండి అని కార్యకర్తలకు, ఓటర్లకు హితబోధ చేశారు. ఉచితంగా 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత మోదీదే. మస్కట్ లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు రూ.16 వేలు ఖర్చు చేస్తే.... మోదీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారు. వడ్ల కొనుగోలు పైసలన్నీ మోదీ ప్రభుత్వం ఇస్తున్నవే. సుతిలీ తాడు నుండి రవాణా దాకా పైసలన్నీ కేంద్రం ఇస్తున్నవే. పల్లె ప్రగతి, స్మశానవాటిక, వడ్డీలేని రుణాలు సహా అన్ని మోదీ ఇస్తున్నవే. కేసీఆర్ మాత్రం సిగ్గులేకుండా వాటివద్ద తన ఫోటోలు పెట్టుకోవడం సిగ్గు చేటు అని బండి సంజయ్ మండిపడ్డారు. 

మోదీ ప్రభుత్వానికి మీరంతా అండగా నిలవాలని కోరుతున్నా. వెంటనే 9090902024 నెంబర్ కు ఫోన్ చేసి మీ మద్దతు తెలపండి. కేసీఆర్ రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడు భూములకు పట్టాలుసహా అ అనేక హామీలిచ్చి మోసం చేశారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. అన్ని వర్గాల కోసం కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమే అని బండి సంజయ్ స్పష్టంచేశారు. కడెం లిఫ్ట్ పైపుల్లో అవినీతి ఏరులైపారుతోంది. 85 సార్లు పైపులు పగిలినయంటే ఎట్లుందో అర్ధం చేసుకోవాలి. రాయపట్న బ్రిడ్జి వద్ద టూరిజం అభివృద్ధి చేస్తానని మోసం చేసిండు. 

ఇది కూడా చదవండి : Revanth Reddy Slams BRS: పొంగులేటి, జూపల్లి అందుకే కాంగ్రెస్ పార్టీలోకి

బీజేపీని కొట్టే దమ్ముకు బీఆర్ఎస్ పార్టీకి లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీతో కలిసి కేసీఆర్ వస్తున్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే....ఢిల్లీలో ర్యాలీలు తీస్తున్నరు. రాష్ట్రపతి అభ్యర్ధి ముర్మును ఓడగట్టాలని చూశారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావడం లేదు. దుబ్బాక నుండి మునుగోడు ఎన్నికల వరకు ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ... అందులో కొందరు వెళ్లాలనుకుంటడం బాధేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్లే... కాంగ్రెస్ పార్టీ నుండి పొరపాటున గెలిస్తే.. వాళ్లంతా బీఆర్ఎస్ పార్టీలోకి వెళతారు... బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే చెప్పారు అని బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి : KCR's Big Decision: రైతుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News