Bandi Sanjay Slams KCR, MIM : ఆదిలాబాద్ : హిందుత్వం గురించి మాట్లాడటానికి ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ‘కరెంట్’ కట్ చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయాలి అంటూ ఆ పార్టీ అధినేతకు బండి సంజయ్ సవాల్ విసిరారు. కాషాయం జెండా భగభగలకు పచ్చ జెండా మాడిమాసై పోవాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అప్పులన్నీ తీరి నిజంగా అభివృద్ధి చెందాలంటే.. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి బీజేపీకి అధికారం అప్పగించాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో ఒకప్పుడు చిప్పలు కడిగేటోడికి ఇప్పుడు వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో జరిగిన సభలో అధికార పార్టీపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, చనకా కొరటా ప్రాజెక్టు నుండి కమీషన్లు వెళ్లాయే తప్ప చుక్క నీరెందుకు ఇవ్వలేదు ? ఈ జిల్లా మంత్రి మిస్టర్ 40 పర్సంటేజ్ కమీషన్ల మినిస్టర్‌గా మారిపోయాడు. అందుకే వేల కోట్లు పోగేసుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కానీ బీజేపి అలా కాదని.. ప్రజల పక్షాన నిలబడి పోరాడటానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. మేం అధికారంలోకొస్తే ఉచిత విద్య, వైద్యంతోపాటు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం అందించి ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు.
కేసీఆర్ పరిపాలనలో సబ్బండ వర్ణాలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా, పత్తాల దందా చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవితపై ఆరోపణలు గుప్పించారు. దేశమంతా కేసీఆర్ ను చూసి నవ్వుతోంది. దేశం నవ్వుతుంటే తెలంగాణ ప్రజలు తలదించుకునే దుస్థితి తలెత్తింది అని బండి సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చి మోసం చేసిండు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతానని చెప్పి మోసం చేశాడు. ఉద్యోగాలు లేవు.. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.20 లక్షల అప్పు భారం మోపిండు. తెలంగాణలో ఎట్లాగూ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు. పొరపాటున కేసీఆర్ గెలిస్తే ఒక్కొక్కరిపై రూ.5 లక్షల అప్పు భారం పెడతారు అని చెబుతూ బండి సంజయ్ కుమార్ తన మాటలతో ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు.
ఇది కూడా చదవండి : Jagtial Collector Yasmeen Basha: యాస్మీన్ భాషా చేతుల మీదుగా నర్సన్న పూజ.. హ్యాట్సాప్ కలెక్టర్
ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook