హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు ప్రారంభం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును ఏర్పాటు చేశారు.

Last Updated : May 22, 2018, 12:36 PM IST
హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు ప్రారంభం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, క్లైమేట్ చేంజ్, నేషనల్ బయో డైవర్సిటీ బోర్డు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగే ఈ సదస్సులో దేశంలో, రాష్ట్రంలో జీవవైవిధ్య పరిసరాల సమస్యలపై అవగాహన పెంచుకోవడంపై చర్చించనున్నారు. 2012 అక్టోబర్‌లో జరిగిన 11 వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కో -11)కు నగరం ఆతిథ్యం ఇచ్చినందున భారత ప్రభుత్వం ఈ ఏడాది  హైదరాబాద్‌ను ఎంచుకుంది.

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సదస్సులో మంత్రి జోగు రామన్న, సీఎస్‌ ఎస్‌కే జోషితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్‌కే పట్నాయక్‌, జాతీయ జీవ వైవిధ్య సాధికారత సంస్థ ఛైర్ పర్సన్ డాక్టర్ మీనాకుమారి, వీసీ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.

 

Trending News