సీఎం కేసీఆర్ నిర్ణయం హాస్యాస్పదం: BJP MLA Raja Singh

Bharat Bandh In Telangana: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తే ప్రతిపక్షాలు మాత్రం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్నదాతలను పక్కదారి పట్టిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శించారు. రైతులను మోసం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

Last Updated : Dec 8, 2020, 04:03 PM IST
  • రైతులను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్
  • అలాంటి వ్యక్తి బంద్‌కు మద్దతివ్వడమా
  • బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం
సీఎం కేసీఆర్ నిర్ణయం హాస్యాస్పదం: BJP MLA Raja Singh

Bharat Bandh In Telangana:  రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తే ప్రతిపక్షాలు మాత్రం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్నదాతలను పక్కదారి పట్టిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతులను మోసం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రైతులను మోసం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని,  అలాంటి వ్యక్తి భారత్ బంద్‌ (Bharat Bandh)కు మద్దతివ్వడమా అంటూ మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని, రైతుల భూములను సైతం కబ్జా చేసి వెంచర్లు వేసింది కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంగా రాజా సింగ్ (Raja Singh) ప్రశ్నించారు. దళారులను తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని అన్నదాతల కోసం చట్టాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

Also Read : Pfizer vaccine in UK: భారత సంతతి వ్యక్తికే తొలి కరోనా వ్యాక్సిన్
 
కాగా, దళారులకు మద్దతు తెలిపేలా కేసీఆర్ ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదమేనన్నారు. రైతులకు దేని వల్ల మేలు జరుగనుందో తెలియాలంటే సీఎం కేసీఆర్ ముందుగా వ్యవసాయ బిల్లులు, రైతు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతిపక్షాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నాయని, ఇది వారికి తగదని ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు.

Also Read : Singer Sunitha Engagement Photos: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ గ్యాలరీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News