Booster Dose Vaccine: ఈ నెంబర్‌‌కు కాల్ చేస్తే చాలు ఇంటికొచ్చి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేస్తారు!

Booster Dose Vaccine at Home: బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేసి డైరెక్ట్‌గా ఇంటి దగ్గరకే వచ్చి వ్యాక్సిన్ అందజేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 10:42 AM IST
  • తెలంగాణలో క్రమంగా తగ్గిపోతోన్న కొవిడ్ థర్డ్‌ వేవ్ ప్రభావం
  • దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులుపడుతున్నటువంటి వృద్ధులకు కొనసాగుతోన్న బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ
  • ఇళ్ల దగ్గరకు వెళ్లి బూస్టర్‌‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేస్తోన్న సిబ్బంది
  • ప్రత్యేకంగా మొబైల్‌ వాహనాల ఏర్పాటు
Booster Dose Vaccine: ఈ నెంబర్‌‌కు కాల్ చేస్తే చాలు ఇంటికొచ్చి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేస్తారు!

Booster Dose Vaccine in GHMC: తెలంగాణలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ థర్డ్‌ వేవ్ ప్రభావం కూడా తగ్గిపోయింది. ఇక తెలంగాణలో ఫీవర్‌ సర్వే కూడా సమర్థంగా సాగింది. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫీవర్‌ సర్వే చేపట్టిన సమయంలో ఫీవర్‌‌ లేదా ఇతర లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడిసిన్‌ కిట్స్‌ కూడా అందజేశారు.

ఇక దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులుపడుతున్నటువంటి వృద్ధులకు బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ విషయంలో కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ 040-21111111 సెంటర్‌‌ను ఏర్పాటు చేసింది. 

ఇప్పటి దాకా ఈ సెంటర్‌‌కు ఫోన్ చేసి చాలా మంది బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఆ వివరాలను బట్టి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆ చిరునామాకు నేరుగా వెళ్లి సంబంధిత వ్యక్తికి బూస్టర్‌‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేస్తోంది. 

ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ వాహనాలను కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఆ వాహనాల్లో వైద్య సిబ్బంది నేరుగా బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ కోసం పేర్లు రిజిస్ట్రేషన్‌ వారి చిరునామాకు వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తోంది. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్ ఇస్తున్నారు.

కాగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-21111111 కు ఫోన్‌ చేసే వారిలో కొందరు రెండో డోస్‌ వ్యాక్సిన్ తీసుకుని తొమ్మిది నెలలు పూర్తి కాని వారు కూడా ఉంటున్నారు. అలాంటి వారికి బూస్టర్‌‌ డోస్‌ వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. అర్హులైన వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. అయితే బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ కోసం రోజూ నూట యాభైకి పైగా కాల్స్ వస్తున్నాయని జీహెచ్‌ఎంసీ సిబ్బంది పేర్కొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ అవసరం ఉన్నవారు హెల్ప్‌లైన్‌ నంబర్‌‌ను సద్వినియోగం చేసుకోవాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Also Read: Jagapathi Babu: అవ‌య‌వ‌దానానికి ముందుకొచ్చిన జగపతిబాబు, బర్త్ డే సందర్భంగా కీలక నిర్ణయం!

Also Read: మెరిసిన సిరాజ్, శ్రేయాస్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం! సిరీస్​ క్లీన్​స్వీప్​!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News