Zee Telugu News Attack: జీ తెలుగు దాడిపై గవర్నర్‌, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

Dasoju Sravan Kumar Complaints To Governor And NHRC On Zee Telugu News Police Attack: విద్యార్థులు, జర్నలిస్టులపై దాడుల విషయమై గవర్నర్‌, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 10, 2024, 09:03 PM IST
Zee Telugu News Attack: జీ తెలుగు దాడిపై గవర్నర్‌, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

Complaints To Governor And NHRC: తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం ఉధృతమవుతున్న వేళ విద్యార్థులు, జర్నలిస్టులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం నిరుద్యోగులు పోరాడుతుండగా వారి పోరాటాన్ని ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై, జర్నలిస్టులపై అమానుషంగా పోలీసులు వ్యవహరించారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శ్రవణ్‌ కుమార్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మానవ హక్కుల సంఘం, ముఖ్యమంత్రికి, డీజీపీకి కూడా లేఖ రాశారు.

Also Read: Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, పోలీస్‌ రాజ్యం నడుస్తోందని దాసోజు శ్రవణ్‌ ఫిర్యాదులో తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థుల పోరాటాలపై అణచివేత, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు విరుచుకుపడుతున్నారని ప్రస్తావించారు. ఈ సందర్భంగా జీ తెలుగు న్యూస్‌ రిపోర్టర్‌ శ్రీచరణ్‌పై జరిగిన దాడిని కూడా ఉదహరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

Also Read: Journalists Protest: జీ మీడియా దాడిపై జర్నలిస్టుల భగ్గు.. సచివాలయం ఎదుట ధర్నా

వెంటనే కల్పించుకుని తెలంగాణలో మానవ హక్కులను పరిరక్షించాలని దాసోజు శ్రవణ్‌ కోరారు. వెంటనే మీరు చొరవ తీసుకోవాలని గవర్నర్‌తోపాటు మానవ హక్కుల సంఘానికి విన్నవించారు. రేవంత్‌ రెడ్డి పాలన సమైక్య పాలనలో చీకటి రోజులను గుర్తు చేస్తోందని వివరించారు. కాంగ్రెస్‌ పాలనలో నిరసన తెలుపుతున్న ప్రతిఒక్కరిపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. పోలీసుల వేధింపులతో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తెలంగాణలో మానవ హక్కులు, న్యాయాన్ని కాపాడాలని కోరుతూ దాసోజు శ్రవణ్‌ తన లేఖలో కోరారు.

జీ తెలుగు దాడిపై ఖండన
జీ తెలుగు న్యూస్‌ చానల్‌ రిపోర్టర్‌పై పోలీసుల దాడిని దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఖండించారు. రేవంత్‌ రెడ్డి పాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేదా? అని ప్రశ్నించారు. అంతకుముందు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు స్పందించారు. ఇక ఈ దాడిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Trending News