బ్రేకింగ్: మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం.. మంత్రి సేఫ్.. డ్రైవర్ సహా ఇద్దరు మృతి!

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని బులెట్ ప్రూఫ్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన కారు ప్రమాదానికి గురి కావడంతో కారు డ్రైవర్ పార్ధ సారధి, సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

Last Updated : Nov 24, 2019, 01:36 AM IST
బ్రేకింగ్: మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం.. మంత్రి సేఫ్.. డ్రైవర్ సహా ఇద్దరు మృతి!

జనగామ: జిల్లాలోని లింగాలఘణపురం మండలం చీటూరు గ్రామం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని బులెట్ ప్రూఫ్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన కారు ప్రమాదానికి గురి కావడంతో కారు డ్రైవర్ పార్ధ సారధి(30), సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ(27) అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో ప్రయాణిస్తున్న గన్‌మెన్‌ నరేశ్‌, అటెండర్‌ తాతారావు, శివ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంత్రి దయాకర్‌ రావు కూడా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఊహించని పరిణామంతో మంత్రి ఎర్రబెల్లి విషాదంలో మునిగిపోయారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సిబ్బందితో కలిసి హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అదృష్టవశాత్తుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో కారులో ప్రయాణిస్తుండటంతో ఆయనకు ప్రమాదం తప్పినప్పటికీ... తన వద్ద పనిచేస్తోన్న సిబ్బందిలో ఇద్దరు ఈ ప్రమాదంలో కన్నుమూయడం ఆయనను తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది. 

Trending News