Coronavirus Updates in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. రెండు రోజుల నుంచి మళ్లీ రాష్ట్రంలో 1600లకు పైగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే గత 24 గంటల్లో శుక్రవారం ( నవంబరు 6న రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,607 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు (6) ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,48,891 కి చేరగా.. మరణాల సంఖ్య 1,372 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: TS EAMCET 2020: నేటి నుంచి ఎంసెట్ తుది విడుత కౌన్సెలింగ్
అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 937 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ( Telangana ) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,27,583 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 19,936 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 91.43 శాతం ఉండగా.. మరణాల రేటు 0.55 శాతం ఉంది. Also read: Kajal, Gautam latest pics: న్యూ ఫొటోషూట్‌లో తళుక్కుమన్న కొత్త జంట
ఇదిలావుంటే.. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 44,644 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 6వ తేదీ వరకు మొత్తం 45,75,797 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 296 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. Also read: Bihar Assembly Election 2020: బీహార్ తుది దశ పోలింగ్ ప్రారంభం