Revanth Reddy Counter to KTR: మంత్రి కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Revanth Reddy Counter to KTR: అమరుల తల్లుల కడుపుకోత గుర్తించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సకుటుంబ సమేతంగా తెలంగాణకు వస్తుంటే.... రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగి కుట్రలు చేస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

Written by - Pavan | Last Updated : Sep 14, 2023, 06:13 AM IST
Revanth Reddy Counter to KTR: మంత్రి కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Revanth Reddy Counter to KTR: ఈ నెల 17వ తేదీన సాయంత్రం తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయ భేరి మోగించేందుకు సోనియాగాంధీ రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓరుగల్లుది కీలక పాత్ర. సమీక్ష సమావేశానికి వేలాదిగా తరలి వచ్చి ఓరుగల్లు కాంగ్రెస్ అడ్డా అని చాటారు. అమరుల తల్లుల కడుపుకోత గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి సోనియాగాంధీ సకుటుంబ సమేతంగా తెలంగాణకు వస్తుంటే.... రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగి కుట్రలు చేస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

17న వరంగల్‌లో ఉత్సవాలు చేస్తామన్న కిషన్ రెడ్డి... కాంగ్రెస్ సభ పెడతామంటే పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా హైదరాబాద్‌కు మార్చుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర. పోన్లే గచ్చిబౌలి స్టేడియం ఇవ్వమని అడిగితే.. చిన్న కారణం సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్... ఇవాళ కాంగ్రెస్ సభ జరుగకుండా బీజేపితో కలిసి కుట్రలు చేస్తుండు. తుక్కుగూడలో బహిరంగ సభ కోసం ఓ స్థలం అడిగితే దేవుడి మాన్యాలు అని నిరాకరించారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో సభలు జరగడంలేదా ? ఇదంతా చూస్తోంటే కేసీఆర్ కావాలనే సోనియా గాంధీ సభకు అడ్డు తగులుతున్నాడని కాక ఇంకేం అనుకోవాలి అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ సభను అడ్డుకోవాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.

సోనియా గాంధీ సభ జరగకుండా కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కోసం తుక్కుగూడ రైతులు ముందుకొచ్చి 200 ఎకరాల భూమి సభ కోసం ఇచ్చారు అని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు కుట్రలు చేసినా.. రైతులు, సామాన్యులు ముందుకొచ్చి సభకు స్థలాన్నిచ్చారు అని అక్కడి రైతులను కొనియాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సభను విజయవంతం చేసేలా వరంగల్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, జనం భారీగా తరలిరావాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాక్షసుడు కేసీఆర్, బ్రహ్మరాక్షసుడు మోదీని ఎదుర్కోవడానికి సోనియమ్మ తెలంగాణ గడ్డమీదకు వస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చి సోనియమ్మ సభను విజయవంతం చేయండి అని వరంగల్ వాసులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్
సోనియ గాంధీ తెలంగాణ ఇచ్చిన రోజు అమెరికాలో బాత్రూంలు కడుగుతున్న కేటీఆర్‌కు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గొప్పతనం ఏం తెలుసు అంటూ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటన్నింటిని లెక్కచేయకుండా పార్లమెంట్ లో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అమెరికా నుంచి దుబాయ్ వెళ్లి వచ్చిన కేటీఆర్ నిషా ఇంకా దిగినట్టు లేదు. కేవీపీతో చీకట్లో కలిసింది మీ అయ్యనే... కేవీపీ చెప్పాడని కొంతమంది అధికారులను నియమించుకున్నారు. మీరు మీరు చీకట్లో పంచుకుని నా వెనక కేవీపీ ఉన్నారని మాట్లాడుతారా ? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఇది కూడా చదవండి : Eetala Rajender Demands For MSP: కేసీఆర్ ఇవ్వాల్సింది రైతు బందు కాదు.. ఈటల ఫైర్

తెలంగాణ అమరవీరుల స్థూపం కాంట్రాక్టు కూడా ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన మీరా నా గురించి మాట్లాడేది..
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్ల దగ్గర తాకట్టు పెట్టింది మీరు. మీరా నా గురించి మాట్లాడేది... నువ్వు మీ అయ్యా నా ఎడమకాలి చెప్పుకు కూడా సరిపోరు. సమైక్యవాదులతో అంటకాగుతోంది మీరు... అమరవీరుల స్థూపం ప్రారంభించి వంద రోజులు కాకముందే పగుళ్లు పట్టాయి... ఆ అమరవీరుల స్థూపం కాంట్రాక్టు కూడా ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన మీరా నా చిత్తశుద్ధిని శంకించేది. తెలంగాణ కోసం నేను కొట్లాడిన అనడానికి మాజీ గవర్నర్ నరసింహన్ సజీవ సాక్ష్యం... తెలంగాణను ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఈ తండ్రీ కొడుకులు... తెలంగాణ సంపదను ఈ తండ్రీ కొడుకులు కొల్లగొడుతున్నారు. ఆఖరికి తమ పార్టీ పేరులో కూడా తెలంగాణ పేరును తొలగించిన ద్రోహులు కేసీఆర్, కేటీఆర్ అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇది కూడా చదవండి : ఒక్క పంపును ప్రారంభిస్తే.. ప్రాజెక్టు పూర్తయినట్టా..? కేసీఆర్ పై రేవంత్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News