Non-Agricultural properties registration | హైదరాబాద్: నాన్-అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ఊపందుకోనుంది. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ని ఆదేశించినట్టుగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ వద్ద ఉన్న పాత డేటా ఆధారంగానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 29న ధరణి పోర్టల్‌ను ప్రారంభించగా.. కోర్టు కేసుల కారణంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయి సుమారు మూడు నెలలు అవుతోంది.
Hon’ble CM Sri KCR Garu has directed chief secretary to commence the registration activities of Non-Agricultural properties from tomorrow in accordance with the HC orders
— KTR (@KTRTRS) December 10, 2020
Also read : NEET 2021 updates: నీట్ 2021 పరీక్షలు రద్దు చేస్తారా అనే సందేహాలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి
ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 9న ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ( Non-Agricultural properties registration on Dharani Portal ) ఆపాలని చెప్పలేదన్న హైకోర్టు.. పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుపై కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ కోరగా.. ఈ విషయంలో ధరణి పోర్టల్ ( Dharani Portal ) జీవోలకు సంబంధించిన వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టును ప్రభుత్వానికి ఆదేశాలు ఆదేశించింది.
Also read : Kavitha Kalvakuntla: డ్రైవర్ వివాహానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook