KCR BRS Party: ఆ తర్వాతే జాతీయ పార్టీపై ప్రకటన.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

KCR BRS Party: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వాయిదా పడింది. రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాకే దీనిపై ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 25, 2022, 10:15 AM IST
  • వాయిదాపడ్డ కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన
  • రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాకే పార్టీ ప్రకటించాలనుకుంటున్న కేసీఆర్
  • వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక
KCR BRS Party: ఆ తర్వాతే జాతీయ పార్టీపై ప్రకటన.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

KCR BRS Party: తెలంగాణ నేత నుంచి దేశ్‌ కీ నేతగా గుర్తింపు పొందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనే కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. దీనిపై ఇప్పటివరకూ లీకులు తప్ప అధికారిక ప్రకటన రాలేదు. ఈ నెలలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ అనుకోకుండా ఆ నిర్ణయం వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల హడావుడి నెలకొంది. ఇలాంటి తరుణంలో కొత్త జాతీయ పార్టీని ప్రకటించినా అందరి అటెన్షన్ ఎన్నికల వైపే ఉంటుందని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా పార్టీ ప్రకటన వాయిదా పడటానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ టీఆర్ఎస్‌ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూశాకే పార్టీపై ప్రకటన చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలోనూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేసి సైలెంట్ అయిన కేసీఆర్.. ఈసారి కూడా జాతీయ పార్టీ ఏర్పాటుపై లీకులు ఇచ్చి మళ్లీ సైలెంట్ అయిపోయారనే చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారనే ప్రచారం లేకపోలేదు. జాతీయ స్థాయిలో తన కొత్త పార్టీకి అవసరమయ్యే సలహాదారులను నియమించుకునేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలు యూనివర్సిటీలకు చెందిన మేదావులను ఆయన సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైతే కేసీఆర్ బీఆర్ఎస్‌కి సంబంధించి లీకులు, ఊహాగానాలే తప్ప అధికారిక ప్రకటనలేవీ లేవు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక అయినా కొత్త పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందా లేదా వేచి చూడాలి. 

 

Also Read: Karan Johar about Shahrukh Khan : షారుక్‌ ఖాన్‌తో శారీరక సంబంధం.. ఆ బుక్లో ఓపెన్!

Also Read: Brown Rice Benefits For Diabetes: టైప్ 2 డయాబెటిస్ రోగులు తెల్ల బియ్యం తింటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News