కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్ (Bharat Bandh) కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ (Hyderabad) నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో (Telangana) మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని.. అలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi ) కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేంద్రం.. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేసింది.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా దసరా (Dasara 2020) పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు వారి వారి ప్రాంతాల్లోని ఆలయాలకు చేరుకుని కనకదుర్గా (durga devi) అమ్మవారికి పూజలు చేస్తున్నారు. దసరా (Vijayadashami ) పర్వదినం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( K. Chandrashekar Rao) ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (KCR) మనవడు, మంత్రి కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు (K. Himanshu) కి గాయాలైనట్లు తెలిసింది. హిమాన్షు కాలికి తీవ్రంగా ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.
నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే కయ్యం పెట్టుకుందని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
మహిళల బయో టాయిలెట్స్ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అలా అని నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రజలకు సూచించారు. అయితే.. కరోనా సోకిన వారు అధిక బిల్లులు చెల్లిస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) కళాశాలల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్‌ను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచేందుకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది.
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించనున్న తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఆలయం, మసీదులను ప్రభుత్వం (Telangana Govt) తరపున నిర్మించి సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) శుక్రవారం ప్రకటించారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తానని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.