CM KCR letter to PM Modi: యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ఫైట్‌కి సిద్ధమైన సీఎం కేసీఆర్ తాజాగా ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణలో పండించిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యాన్ని పూర్తిగా సేకరించనిపక్షంలో అది రైతులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. జాతీయ ఆహార భద్రతా లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్నారు. అంతేకాదు, మొత్తం వరి ధాన్యాన్ని సేకరించకపోతే కనీస మద్దతు ధరకు అర్థం ఉండదన్నారు.
పంజాబ్, హర్యానాల్లో మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని... ఆ తరహాలో తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయట్లేదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవడంపై అభ్యంతరం తెలిపారు. పంటల సేకరణపై జాతీయ స్థాయిలో ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రైతుల కోసం అమలుచేస్తున్న పథకాలతో రాష్ట్రంలో పంటల దిగుబడి పెరిగిందన్నారు. తద్వారా రాష్ట్రంలో రైతుల వలసలు, ఆత్మహత్యలకు తగ్గాయని తెలిపారు.
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర పౌర సరఫరాలు, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలంగాణ మంత్రులకు గురువారం ఉదయం 11.40 గంటలకు అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో పీయుష్ గోయల్ తెలంగాణ మంత్రులకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారు.. మంత్రుల డిమాండ్లు, ప్రతిపాదనలకు ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే మరో యుద్ధానికి నడుం బిగిస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ స్థాయిలో పెద్ద ఎత్తున రైతుల కోసం మరో ఉద్యమం చేపడుతామని అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం.. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదని అంటోంది. రేపు పీయుష్ గోయల్‌తో సమావేశం తర్వాత ధాన్యం కొనుగోళ్ల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ వెల్లడించిన కీలక వివరాలు..
Also Read: Boycott RRR in Karnataka: 'ఆర్ఆర్ఆర్'కి కన్నడిగుల షాక్... సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook