TRS MLA: నయీమొద్దీన్ ఫ్రెండ్.. దావూద్ ఇబ్రహీం కంటే డేంజర్! టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు..

TRS MLA:  కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని రోజులుగా తెలంగాణలో దూకుడు పెంచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం రేపాయి. పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏతో పాటు ఈడీ ముమ్మర తనిఖీలు చేసింది. కేంద్ర సంస్థల దాడులన్ని టీఆర్ఎస్ నేతల టార్గెట్ గానే సాగుతున్నాయి.

Written by - Srisailam | Last Updated : Sep 28, 2022, 03:52 PM IST
  • ఈడీ ఉచ్చులో మంచిరెడ్డి
  • ఫెమా కేసులో ప్రశ్నల వర్షం
  • మంచిరెడ్డిపై మల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
 TRS MLA: నయీమొద్దీన్ ఫ్రెండ్.. దావూద్ ఇబ్రహీం కంటే డేంజర్! టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు..

TRS MLA:  కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని రోజులుగా తెలంగాణలో దూకుడు పెంచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం రేపాయి. పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏతో పాటు ఈడీ ముమ్మర తనిఖీలు చేసింది. కేంద్ర సంస్థల దాడులన్ని టీఆర్ఎస్ నేతల టార్గెట్ గానే సాగుతున్నాయి. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. రెండు రోజుల పాటు ఎమ్మెల్యేను విచారించిన ఈడీ అధికారులు.. విదేశాల్లో జరిగిన నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ కు సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడి విచారణ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.

ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని డాన్ తో పోల్చారు. మంచిరెడ్డి దావూద్ ఇబ్రహీంని దాటి పోయారని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేలాది ఎకరాలను స్వాహా చేశారని ఆరోపించారు. దశాబ్దాల కింద ఇందిరాగాంధీ పేదలకు పంచిన అసైన్డ్ భూములను ఎమ్మెల్యే అక్రమంగా లాక్కున్నారని మండిపడ్డారు. నర హంతకుడు నయీమొద్దీన్ తో రైతులను బెదిరించి భూములు కబ్జా చేశాడని మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు.  ప్రభుత్వ భూములను ఆక్రమించి తన బినామీల దగ్గర పెట్టారని అన్నారు. చెరువు భూములను అమ్మేసి కోట్లాది రూపాయలు కూడబెట్టారని మల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫార్మా సీటీకి సేకరించి 8632 ఎకరాల అసైన్డ్ భూమిలో 200 ఎకరాలు కిషన్ రెడ్డి కొట్టేశారని ఆరోపించారు.

మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై 2015లో హవాలా కేసు నమోదైందని ఈడీనే చెబుతుందన్నారు మల్ రెడ్డి. ఎమ్మెల్యే చేసిన మనీ లాండరింగ్ కి హవాలా డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని..? ఇప్పుడేంతో తేల్చాలన్నారు. ఏ వ్యాపారం చేసి వందల కోట్ల రూపాయలు కూడబెట్టాడో కిషన్ రెడ్డి ప్రజలకు చెప్పాలన్నారు. అవినితీ ఎమ్మెల్యేను కేసీఆర్ వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని మల్ రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి అండతోనే అక్రమాలకు పాల్పడ్డారని భావించాల్సి ఉంటుందన్నారు రంగారెడ్డి. ఆరు నెలల క్రితం మాదాపూర్ లో పేకాట ఆడుతూ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డారని ఆరోపించారు. కిషన్ రెడ్డి అక్రమాలపై ఈడీ విచారణ ఒక్కటే సరిపోదని.. సీబీఐ, ఐటీ శాఖలతో కూడా విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు.

Also Read : KCR NEW PARTY: కేసీఆర్ కొత్త పార్టీ రెడీ.. దసరాకి రిలీజ్? గులాబీ పార్టీలో సంబురం

Also Read : CM Jagan: రాయలసీమ రైతులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News