Rythu Bandhu: మాటలు కోటలు దాటుతాయి.. పనులు గేటు కూడా దాటట్లేదు: రైతు బంధుపై కోమటిరెడ్డి లేఖ

MP Komatireddy Letter to CM KCR: రైతు బంధు పథకంపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు ఎప్పుడు పడతాయోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు కొంత వరకే విడుదల చేశారని.. పూర్తిస్థాయిలో అందరికీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 20, 2023, 01:46 PM IST
Rythu Bandhu: మాటలు కోటలు దాటుతాయి.. పనులు గేటు కూడా దాటట్లేదు: రైతు బంధుపై కోమటిరెడ్డి లేఖ

MP Komatireddy Letter to CM KCR: రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో డబ్బులు రాక రైతులు పడుతున్న ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. మీ మాటలు కోటలు దాటుతాయని.. పనులు మాత్రం గేటు కూడా దాటవని ఎద్దేవా చేశారు. దీనికి నిదర్శనమే రైతు బంధు డబ్బుల జమ అని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని.. రైతులు పనులు ప్రారంభించారు కానీ, రైతు బంధు మాత్రం పూర్తి స్థాయిలో అందలేదన్నారు. ఇంకా లక్షల మంది అన్నదాతలు ఆ నగదు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.

"బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు ఎప్పుడు పడతాయి..? అని మెసేజ్‌ వచ్చి సెల్‌ ఫోన్‌ ఎప్పుడు మోగుతుందా అని చూస్తున్నారు రైతులు. వానాకాలం సాగు ప్రారంభం కావడంతో రైతులు ముందుగా వరి నార్లు పోశారు. కానీ, చాలా వరకు పత్తి సాగు వైపు మళ్లారు. వరి విత్తనాల కొనుగోలుకే రైతులు దాచుకున్న డబ్బులు అయిపోయాయి. పత్తి విత్తనాల కొనుగోలుకు రైతుబంధు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఇంతవరకు రైతులందరికీ రైతు బంధు నగదు అందలేదు. ఆర్థికశాఖ కొంతవరకే నిధులు విడుదల చేసిందని తెలిసింది. దీనివల్ల కొందరికే జమ అయ్యాయి. మిగిలినవారికి ఎదురుచూపులు తప్పడం లేదు.

ఈ ఏడాది రైతు బంధు కింద దాదాపు 70 లక్షల మంది అర్హులుగా ఉన్నారు. మొత్తం రూ.7,720.29 కోట్ల నిధులు అవసరమని అంచనా. మరి, అందరికీ ఎప్పుడు జమచేస్తారు. రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టుకోవడం కాదు.. రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారో చెప్పండి. రైతు సంఘాల ద్వారా నాకు మరో విషయం తెలిసింది. రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ చేయగా వాటిని తీయడానికి వీలు లేకుండా అకౌంట్‌ లను హోల్డ్‌లో పెడుతున్నారట. రైతు బంధు పేరుతో ప్రభుత్వం ఒకవైపు డబ్బులు వేస్తూనే.. మరోవైపు బ్యాంకులలో రుణాలు చెల్లించాలనే కారణంతో రైతుల ఖాతాలను హోల్డ్‌లో ఉంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.." అని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.

లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయకపోవడంతో బ్యాంకులలో వడ్డీల మీద వడ్డీలు పెరిగి అన్నదాతల అప్పులు రెట్టింపయ్యాయని చెప్పారు. ప్రభుత్వం చేసిన మోసంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే హోల్డ్‌లో పెట్టిన అకౌంట్స్‌ను తిరిగి ప్రారంభించి రైతులకు నగదు అందేలా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మిగిలిన రైతులకు కూడా రైతు బంధు నగదును వెంటనే జమ చేయాలన్నారు. లేదంటే రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

Also Read: Manipur Violence: మణిపూర్‌లో భయంకరమైన వీడియో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. దారుణం..!  

Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News