Corona in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు- జిల్లాల వారీగా వివరాలు ఇలా..

Corona in Telangana: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రికవరీలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కొవిడ్​తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 08:17 PM IST
  • రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసుల
  • క్రితం రోజుతో పోలిస్తే రికవరీలు
  • హైదరాబాద్​, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాల్లో అధికంగా కేసులు
Corona in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు- జిల్లాల వారీగా వివరాలు ఇలా..

Corona in Telangana: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,590 కేసులు (Telangana Corona cases) నమోదైనట్లు ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం ప్రకటించింది. క్రితం రోజు రాష్ట్రంలో 3,877 కేసులు నమోదవడం గమనానార్హం.

ఇందులో 1,160 కేసులు ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే (Corona cases in GHMC) నమోదైనట్లు ఆరోగ్య శాఖ వివరించింది.

మొత్తం 95,355 టెస్టులకుగానూ.. ఈ కేసులు (Telangana Corona update) నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య భారీగా తగ్గింది.

శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి శనివారం 5.30 వరకు ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది ఆరోగ్య శాఖ.

రాష్ట్రంలో కరోనా రికవరీలు..

ఇక గడిచిన 24 గంటల్లో 3,555 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,14,034 మంది కరోనాను (Corona recoveries in Telangana) జయించారు.

మరణాలు ఇలా..

మహమ్మారికి రాష్ట్రంలో తాజాగా ఇద్దరు బలయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,085కు చేరినట్లు (Corona deaths in Telangana) ఆరోగ్య శాఖ పేర్కొంది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 40,447 యాక్టివ్​ కొవిడ్ కేసులు (Corona Acitve cases in Telangana) ఉన్నాయి.

జిల్లాల వారీగా ఇలా..

  • అదిలాబాద్​-47
  • భద్రాద్రి కొత్తగూడెం-105
  • జగిత్యాల-57
  • జనగామ-42
  • జయశంకర్​ భూపాలపల్లి-31
  • జోగులాంబ గద్వాల-28
  • కామారెడ్డి-42
  • కరీంనగర్​-119
  • ఖమ్మం-121
  • కొమురం భీమ్​ ఆసిఫాబాద్​-22
  • మహబూబ్​నగర్​-71
  • మహబూబాబాద్​-46
  • మంచిర్యాల-79
  • మెదక్-47
  • మేడ్చల్ మల్కాజ్​గిరి-257
  • ములుగు-22
  • నాగర్​కర్నూల్​-45
  • నల్గొండ-98
  • నారాయణపేట్​-26
  • నిర్మల్​-47
  • నిజామాబాద్​-67
  • పెద్దపల్లి-63

Also read: land price in Hyderabad: హైదరాబాద్​లో భూముల ధరలకు రెక్కలు- ఎక్కడెక్కడ ఎంతంటే?

Also read: Telangana Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల రీఓపెనింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News