Minor Giral Killed Mothers Boyfriend in Medchal: కామంతో కొన్ని సార్లు కళ్లు మూసుకు పోతాయి. ఆ సమయంలో ఏం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా నీచంగా ప్రవర్తించే వారు చాలా మంది ఉంటారు. ఈ మధ్య కాలంలో అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న వారి గురించి మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నాం. కూతురు వరుస అమ్మాయిలను.. చెల్లి వరుస అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు కఠిన శిక్షలు అనుభవిస్తున్నా కూడా వారిని చూసి అయినా భయపడకుండా కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల మేడ్చల్ జిల్లా కండ్లకోయలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళతో సహజీవనం చేస్తూ.. ఆ మహిళ యొక్క కూతురిపై లైంగిక వాంఛ పెంచుకున్న వ్యక్తి చివరకు మైనర్ బాలిక చేతిలో దెబ్బలు తిని మృతి చెందాడు.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయ ప్రాంతంలో ఒరిస్సాకు చెందిన జయ శ్రీ నాయక్ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె గత కొంత కాలంగా పద్మనాభ నాయక్ తో సహజీవనం సాగిస్తుంది. కొన్ని వారాల క్రితం జయశ్రీ నాయక్ యొక్క కూతురు ఊరు నుండి కండ్లకోయకు వచ్చింది. ఆ మైనర్ బాలిక వచ్చినప్పటి నుండి పద్మనాభ నాయక్ ప్రవర్తన పూర్తిగా మారింది. అతడు పదే పదే ఆ బాలికతో చనువుగా మాట్లాడేందుకు ప్రయత్నించడం.. మీద చేతులు వేసేందుకు ప్రయత్నించడం చేశాడట. ఒకటి రెండు సార్లు బాలిక మరియు జయ శ్రీ నాయక్ కూడా హెచ్చరించారట. కూతురుగా భావిస్తున్నాను అంటూ ఆ సమయంలో పద్మనాభ నాయక్ చెప్పాడట.
ఈనెల 8వ తారీకున మధ్యాహ్నం సమయంలో జయశ్రీ నాయక్ డ్యూటీ కి వెళ్లింది. ఆ సమయంలో ఆమె కూతురు మాత్రమే ఇంట్లో ఉంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పద్మనాభ నాయక్.. మైనర్ బాలికపై అఘాయిత్యంకు ప్రయత్నించాడట. వద్దు వద్దు అంటూ ఎంత వారించినా కూడా లైగికంగా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆ బాలిక చేతికి అందిన కర్రతో పద్మనాభ నాయక్ పై కొట్టింది. దాంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. అదే సమయంలో జయశ్రీ నాయక్ లంచ్ బ్రేక్ సమయంలో ఇంటికి తిరిగి రావడంతో రక్తపు మడుగులో అతడు పడి ఉన్నాడు. దాంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నింధితురాలు మైనర్ బాలిక అవ్వడంతో హోంకు తరలించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
Also Read: MS Dhoni Deepak Chahar: సీరియస్‌గా చూస్తూ.. చెన్నై బౌలర్ తలపై ఒక్కటేసిన ఎంఎస్ ధోనీ! వైరల్ వీడియో
Also Read: 2023 World Cup Schedule: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్.. భారత్ తొలి పోరు ఎవరితోనో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.