Ap & Telangana: ఆర్టీసీ బస్సులు నడిచేనా ? తేలని నిర్ణయం

ఏపీ, తెలంగాణ ( Ap & Telangana ) లో మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే విషయంలో నిర్ణయం మరోసారి వాయిదా పడింది. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కన్పించలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Last Updated : Aug 24, 2020, 08:26 PM IST
Ap & Telangana: ఆర్టీసీ బస్సులు నడిచేనా ? తేలని నిర్ణయం

ఏపీ, తెలంగాణ ( Ap & Telangana ) లో మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే విషయంలో నిర్ణయం మరోసారి వాయిదా పడింది. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కన్పించలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) లో భాగంగా ఒక్కొక్కటీ తెర్చుకుంటున్న నేపధ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల్ని ( Rtc buses ) ప్రారంభించే విషయంలో సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. తెలంగాణలోని బస్ భవన్ ( Meeting in Telangana Bus bhavan ) లో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికార్ల మధ్య సమావేశం జరిగింది. అయితే నిర్ణయం తీసుకోలేకపోవడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసుల అంశంపై కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికార్లు ఏపీ ( AP ) ముందు ప్రతిపాదన ఉంచారు.  

లాక్ డౌన్ ( lockdown ) నేపధ్యంలో మార్చ్ 22 నుంచి ఏపీ, తెలంగాణల మధ్య బస్సులు నిలిచిపోయాయి. అనంతరం మే 21 నుంచి ఏపీ నుంచి కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిస్సాలకు బస్సులు ప్రారంభమైనా...తెలుగు రాష్ట్రం తెలంగాణాకు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ రెండు రాష్ట్రాల మధ్య బస్సుల ప్రారంభం విషయంలో ఇది రెండో సమావేశం. జూన్ నెలలో విజయవాడలో తొలి సమావేశం జరిగింది. కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలన్న తెలంగాణ అధికార్ల సూచన నేపధ్యంలో నిర్ణయం కోసం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. Also read:Telangana: స్థానిక ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్..నేతల్లో ఆందోళన

Trending News