Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే స్టేషన్‌లో నిన్న అలజడి చోటుచేసుకుంది. అగ్నిపథ్ రద్దు చేయాలంటూ ఆర్మీ అభ్యర్థులు రైల్వే స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. రైళ్లకు నిప్పు పెట్టారు. విధ్వంసంలో కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో ఒకరు మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి.
ఈకేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..లోతుగా విచారిస్తున్నారు. ఘటన వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈకేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. విధ్వంసానికి కారణమైన 200 మంది అభ్యర్థులను ఇప్పటివరకు గుర్తించారు. ఇందులో వంద మందిని రిమాండ్‌కు తరలించనున్నారు. వాట్సాప్ గ్రూప్స్‌లో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.
వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న పలువురు అభ్యర్థులను గుర్తించారు. ఇందులో పలువురిని అరెస్ట్ చేశారు. మరోవైపు రైల్వే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ అంత్యక్రియలు ముగిశాయి. ఖానాపూర్ మండలం దబ్బీర్‌పేటలో అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలు చేపట్టారు. ఇందులో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతకముందు అంతిమ యాత్ర భారీ ఎత్తున జరిగింది. ఇందులో మంత్రులు పాల్గొన్నారు. రాకేష్ పాడేను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మోశారు. ఇటు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు కట్టడి చేశారు. రాకేష్ చితికి తండ్రి కుమారస్వామి నిప్పంటించాడు.
Also read: Agnipath Effect: దేశంలో అగ్నిపథ్ ఎఫెక్ట్..పలు రైళ్ల రాకపోకలు రద్దు..ఆ వివరాలు ఇవిగో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook