Etela Rajender: అసెంబ్లీలో టీఆర్ఎస్ తప్పించుకున్నా.. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్న ఈటల..!

Etela Rajender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలిరోజు సెషన్స్‌పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హాట్ కామెంట్స్ చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 6, 2022, 02:37 PM IST
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • సెషన్స్ తీరుపై విపక్షాల ఫైర్
  • టీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
Etela Rajender: అసెంబ్లీలో టీఆర్ఎస్ తప్పించుకున్నా.. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్న ఈటల..!

Etela Rajender: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన తెలంగాణ శాసన సభ తొలిరోజు ఐదు నిమిషాలకే జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్దారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పించుకుందని..ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ సర్కార్..అసెంబ్లీ సమావేశాలను నామమాత్రంగా నడిపిస్తోందని మండిపడ్డారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే రఘునందర్‌రావుతో కలిసి మాట్లాడిన ఆయన..టీఆర్ఎస్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ ఓ వేదిక అని కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు 60 నుంచి 80 రోజులపాటు జరిగేవని..అదే బడ్జెట్ సమావేశాలైతే 40 నుంచి 50 రోజులులు జరిగేవని గుర్తు చేశారు.

గత సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను అకారణంగా సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. అవకాశం ఇస్తే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని..అలా కాకపోతే ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ పోచారం స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని..సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుచుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో పార్టీకి ఓ ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచే వారని గుర్తు చేశారు.

ప్రస్తుతం సభా సంప్రదాయాలు కొనసాగడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో ఇంత తక్కువ రోజులు సమావేశాలు జరగడం ఇదే తొలిసారి అని అన్నారు. బీఏసీలో చర్చించకుండా మూడురోజులపాటు సమావేశం జరుగుతుందని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఇది సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శమన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.

గతంలో రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీని బీఏసీకి పిలిచేవారని..ఇప్పుడు ముగ్గురు ఉన్నా పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉండే బీఏసీకి పిలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడురోజుల సమావేశంలో ఏం మాట్లాడగలమన్నారు. తక్షణమే అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలు మారాల్సిన పరిస్థితి ఉందన్నారు.

Also read:IND vs SL Free Live Streaming: భారత్ vs శ్రీలంక మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు.. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్‌లో మాత్రం కాదు!

Also read:Suresh Raina Retires: ఆటకు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా.. ఇక చెన్నై టీమ్‌కి కెప్టెన్ పక్కా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News