Phone Tapping Case: కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహిళలు రోడ్లపై ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదన్నారు. గతంలో తాము ప్రజల అవసరాలు ఎట్ల తీర్చాలని ఆలోచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేరికలపై దృష్టి పెట్టిందన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం తండాల నుంచి మొదలుకొని హైదరాబాద్ దాకా ఏ రోజు కూడా తాగునీటి ఇబ్బందులు రానియ్యలేదన్నారు. మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి రూ.38 వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేశామన్నారు.
50 ఏళ్ల పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య లేకుడా చేశామని.. తమ ప్రభుత్వం దిగిపోగానే నగరంలో ట్యాంకర్ల హడావిడి మొదలైందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా మొదలైందన్నారు. నగరంలో ప్రకృతి వల్ల వచ్చిన కొరత కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనంవల్ల వచ్చిన కొరత అని అన్నారు. గతంలో 14 శాతం అధికంగా వర్షం ఉన్నా.. తాగునీటి కొరత ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయని.. వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హీరోయిన్లతో సంబంధం లేదని.. ఎవరి బెదిరించలేదన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ముఖ్యమంత్రిని వదిలి పెట్టేలేదని హెచ్చరించారు. అడ్డగోలుగా ఎవరైనా మాట్లాడితే లీగల్‌గానే చూసుకుంటామన్నారు. ప్రభుత్వం మాత్రమే మారిందని అధికారులు ఎవరు మారలేదని.. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అధికారులు బాధ్యులు కాదా..? ప్రశ్నించారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ టాపింగ్ వ్యవహారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం పక్కన ఉన్న పొన్నం ప్రభాకర్ గతంలో చేసిన విమర్శలపైన సమాధానం చెప్పాలన్నారు. ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. ఎవరు చేశారనేది ప్రభుత్వం తేల్చాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై ప్రభుత్వం అడ్డగోలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందని ఫైర్ అయ్యారు.
Also Read: Deepthi Sunaina: పరువాలతో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా, లేటెస్ట్ ఫోటోలు వైరల్
Also Read: Jasprit Bumrah love story: జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ లవ్ స్టోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి