RK Roja: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీమంత్రి

RK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్‌కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 18, 2024, 03:29 PM IST
RK Roja: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీమంత్రి

  YSR Congress Party: అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన ఆర్‌కే రోజా అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎన్నికల తర్వాత కొన్నాళ్లు వ్యక్తిగత పనులతో బిజీ అయిన ఆమె ప్రస్తుతం రాజకీయంగా మళ్లీ గతంలో రోజాను గుర్తుచేస్తున్నారు. 2019కు ముందు రోజా మళ్లీ కనిపిస్తోంది. తాజాగా సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్‌లపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై గతంలో మాదిరి విరుచుకుపడ్డారు.

Also Read: Ragging: ర్యాగింగ్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌.. విచారణకు ఆదేశం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్ట్‌కు వ్యతిరేకంగా తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డితోపాటు పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి రోజా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమపై టీడీపీ సోషల్‌ మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆర్‌కే రోజా సెల్వమణి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను హిట్లర్‌, గడాఫీ కలిసి పాలిస్తున్నట్లు పరిస్థితి ఉందని తెలిపారు.

Also Read: Basti Nidra: మూసీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎంపీ ఈటల రాజేందర్

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైఎస్‌ జగన్‌, నాయకులపై అసహ్యాకరమైన రీతిలో సోషల్‌ మీడియా పోస్టులు చేస్తున్నారని.. ఐ టీడీపీ అనే అధికారిక హ్యాండిల్‌ ద్వారా ఇదంతా చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు. ఐ టీడీపీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారిపైన కూడా కేసు పెట్టి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేస్తున్నారని తెలిపారు. మాపై అబద్దపు ప్రచారం చేశారని.. అసెంబ్లీ సాక్షిగా అసలు నిజాలు బయటకు వచ్చాయని చెప్పారు.

చంద్రబాబు తప్పు చేసి ఎదుటి వారిపై రుద్దుతున్నారని మాజీ మంత్రి రోజా తెలిపారు. 'వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వీరెంత? తప్పు చేయని వారిన వెంటనే విడుదల చేయాలి' అని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌తో నెట్టుకొస్తున్నారని పేర్కొన్నారు. 'చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఏం చర్యలు తీసుకుంటున్నారు?' అని ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

  

  

Trending News