Fish prasadam: రేపే మృగశిర కార్తె... చేపల ప్రసాదం కోసం వచ్చేవారు తప్పకుండా తెలుసు కోవాల్సిన విషయాలు ఇవే..

Mrigasira karthi 2024: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మృగశిర కార్తె రోజున జూన్ 8 న చేప ప్రసాదం పంపిణికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 7, 2024, 02:29 PM IST
  • నాంపల్లిలో చేప పిల్లల ప్రసాదం పంపిణి..
  • అన్నిరకాల ఏర్పాట్లు చేసిన అధికారులు..
Fish prasadam: రేపే మృగశిర కార్తె... చేపల ప్రసాదం కోసం వచ్చేవారు తప్పకుండా తెలుసు కోవాల్సిన విషయాలు ఇవే..

Mrigasira karthi 2024 fish prasad distribution: బత్తిన సోదరులు దాదాపు 170 ఏళ్లుగా అస్తమాతో బాధపడుతున్నవారికి మృగశిర కార్తె రోజు కొర్రమీను చేపప్రసాదంగా ఇస్తుంటారు. ఈ రోజున దమ్ము, అస్తమా, ఉబ్బసంతో బాధపడుతున్న వారు పెద్ద ఎత్తున హైదరబాద్ కు వస్తుంటారు. ముఖ్యంగా బత్తిన సోదరులు ప్రత్యేకమైన ఆయుర్వేదిక మూలికాలతో మందును తయారు చేసి, కొర్రమీను చెపనోటిలో ఆ మందును పెట్టి ఆస్తమా ఉన్న వారి నోట్లో వేస్తారు. ఇలా చేపమందు తీసుకున్న వారందరికి ఎంతో మంచిజరిగిందని చెప్పుకుంటారు. చేప మందు తీసుకొవడానికి ఇరుతెలుగు స్టేట్స్ నుంచి మాత్రమే కాకుండా.. రాజస్తాన్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్,  ఉత్తర్ ప్రదేశ్ ల నుంచి వేలాది మంది తరలి రానున్నారు. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

గ్రౌండ్ లోపల ప్రత్యేకమైన స్టాల్స్ లను అధికారులు ఏర్పాటు చేశారు.   చేప ప్రసాదం కోసం క్యూలైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా టోకెన్లు ఇచ్చి అనంతరం.. కౌంటర్‌లో చేప ప్రసాదం ఇస్తారు. చేప ప్రసాదం పంపిణీకి మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీనిలో.. దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. క్యూలైన్‌ల కోసం బారికేడ్‌లు, విద్యుద్దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. జూన్ 8,9 రెండు రోజుల పాటు పంపిణీ జరగనుంది. చేప ప్రసాదంతో ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుంచి రిలీఫ్ దొరుకుతుందని ఇక్కడికి వచ్చిన వాళ్లు భావిస్తారు.

ఇక్కడకు వచ్చే వారికోసం.. అనేకస్వచ్ఛంద సంస్థల సహకారంతో, వైద్య సహాయం, భోజన సౌకర్యం, త్రాగు నీరు వంటి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తారు. చేప ప్రసాదం కోసం వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తోంది. ఇక, జూన్ 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 9 ఉదయం 11 వరకు చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని బత్తిన కుటుంబసభ్యులు తెలిపారు. కొర్రమీను చేప పిల్లలను అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో విక్రయిస్తారు. చేప ప్రసాదం కావాలనుకున్న వారు డబ్బు చెల్లించి, వాటిని కొనుక్కొవాలని సూచిస్తున్నారు.

Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వెళ్లేందుకు గానూ.. 130 స్పెషల్ బస్సులను నడుపనున్నట్టు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంతానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. వీటితో పాటు హైదరాబాద్ లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మరో 80 బస్సులను కూడా నడపనున్నట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News