ED Arrested DC Venkatrami Reddy: పలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకట్‌రామిరెడ్డిను బుధవారం ఎన్‌ఫోర్స్‌మంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో ఆయనతోపాటు.. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో వెంకట్‌రామిరెడ్డిని అరెస్ట్ సీబీఐ అరెస్ట్ చేసింది.
బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయనపై సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. గత కొంతకాలంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఆయనతోపాటు విచారణకు పిలిచి అరెస్ట్ చేసింది. కోర్డులో హాజరు పరిచి.. రిమాండ్‌కు పంపించనున్నారు.
వేల కోట్ల రూపాయలు బ్యాంక్‌లను నుంచి లోన్లు పొందిన వెంకట్‌రామ్‌రెడ్డి.. రుణాలు ఎగవేసినట్లు 2015లో కెనరా బ్యాంక్ సీబీఐని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ.. ఇప్పటికే వెంకట్‌రామిరెడ్డికి చెందిన పలు ప్రాపర్టీస్ సీజ్ చేసింది. గతంలోనే డెక్కన్ క్రానికల్‌కు చెందిన 386 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న డెక్కన్ క్రానికల్ 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బ్యాంకుల నుంచి మొత్తం రూ.8180 కోట్లు రుణాలు పొందినట్లు గుర్తించింది. సీబీఐ, సెబీతో పాటు మొత్తం డెక్కన్ క్రానికల్ స్కామ్‌పై 6 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి.
నిన్న ఈడీ విచారణకు వెంకట్‌రామిరెడ్డి, అయ్యర్, డెక్కన్ క్రానికల్ ఆడిటర్ హాజరవ్వగా.. రోజంతా విచారించి రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేసినట్టు ఈడీ ధృవీకరించింది. అరెస్ట్ చేసిన ముగ్గురిని ఈడీ కోర్టులో హాజరు పరిచనుంది. మంగళవారం ఈడీ విచారణకు వెంకట్‌రామిరెడ్డి సోదరుడు వినాయక రవి రెడ్డి హాజరుకాలేదు.
Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి