Telangana Politics: కాంగ్రెస్‌కు ఝలక్.. ఊహించని షాకిచ్చిన కీలక నేత

Minister Harish Rao: గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది రాజీనామా చేశారు. మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు గులాబీ గూటికి చేరుకున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 18, 2023, 08:33 PM IST
Telangana Politics: కాంగ్రెస్‌కు ఝలక్.. ఊహించని షాకిచ్చిన కీలక నేత

Minister Harish Rao: తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్ది.. ఆ పార్టీ నేతలు ఇటు.. ఈ పార్టీ నేతలు అటు జంప్ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ ఉమ దేవి, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు గులాబీ పార్టీలోకి చేరిపోయారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. 

ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి, డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి సహించలేక బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని సీఎం కేసీఆర్‌తోనే  అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైతుందన్న విశ్వాసంతో పార్టీలో చేరినట్లు చెప్పారు.

అనంతరం హరీష్ రావు  మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. గద్వాల్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి  బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగిందన్నారు. ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. గద్వాల్‌లో కృష్ణమోహన్ రెడ్డిని  గెలిపించుకుందామని.. గద్వాల్  అభివృద్ధిని కొనసాగిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో విడుదలలో, ప్రచారంలో ఎలాగైతే ముందు ఉందో.. రేపు జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని అన్నారు.

"బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయింది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితిలో ఉంది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు, రైతుబంధు, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకి ఎవరు గ్యారెంటీ అని ప్రజలు అడుగుతున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకి, హామీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్యారెంటీ. ఈ తొమ్మిది సంవత్సరాల్లో చెప్పిన చెప్పని హామీలు అన్ని నెరవేర్చి తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపించుకుందాం.." అని హరీష్‌ రావు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: IND vs BAN World Cup 2023: రేపే బంగ్లాదేశ్‌తో భారత్ పోరు.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా..? పిచ్ రిపోర్ట్ ఇలా..!  

ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News