Cyber Crime: క్రిప్టో కరెన్సీ పేరిట రూ.86 లక్షలకు టోకరా..ముఠా అరెస్ట్..!

క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న పశ్చిమ బంగాకు చెందిన ముగ్గురు నిందుతులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 12:44 PM IST
Cyber Crime: క్రిప్టో కరెన్సీ పేరిట రూ.86 లక్షలకు టోకరా..ముఠా అరెస్ట్..!

Cyber Crime: క్రిప్టో కరెన్సీ పేరు(Cryptocurrency)తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబంగా(West bengal)కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  ఈ క్రమంలో నిందితుల ఖాతాల్లోని రూ.50లక్షలను నిలుపుదల చేశారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి చెక్‌బుక్‌లు, 5 చరవాణీలు, ఆరు ఏటీఎం కార్డులు, ఆరు సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలు కేసులు నమోదయిన నేపథ్యంలో...పశ్చిమ బంగా వెళ్లిన పోలీసు ప్రత్యేక బృందం నిందితులను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.  

Also read: Illigal Affair: అంగన్ వాడిలో రాసలీలలు.. 35 ఏళ్ల మహిళతో 14 ఏళ్ల బాలుడు పరార్

పశ్చిమబంగా సిలిగురికి చెందిన బ్యాంకు ఉద్యోగితో కలిసి ముఠా(Gang)లోని చోటా భాయ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కమీషన్‌ పేరుతో ఆశచూపి 64 బ్యాంకు ఖాతాలను ముఠా సేకరించినట్లు వివరించారు. అధిక మొత్తం డబ్బు వస్తుందంటూ షెల్‌ కంపెనీల ఏర్పాటు చేసి నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ ముఠా 14 షెల్‌ కంపెనీల(Shell companies)తో ఆన్‌లైన్‌(Online)లో పెట్టుబడులు సేకరించినట్లు విచారణలో తేలింది. నాంపల్లికి చెందిన వ్యక్తికి రూ.86లక్షల టోకరా వేసినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా నేరాలకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు చోటా భాయ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News