ఆమె నాకు తెలుసు.. కానీ : గజల్ శ్రీనివాస్

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు.

Last Updated : Jan 2, 2018, 02:23 PM IST
ఆమె నాకు తెలుసు.. కానీ : గజల్ శ్రీనివాస్

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తనపై పోలీసులకి ఫిర్యాదు చేసిన అమ్మాయి తనకి తెలిసిన అమ్మాయేనని అంగీకరించిన గజల్ శ్రీనివాస్... తాను మాత్రం ఆమె ఆరోపించినట్టుగా వేధింపులకి పాల్పడలేదని అన్నారు. 

'కొంత కాలంగా తన భుజానికి, కాళ్ల నొప్పులకి ఫిజియోథెరపీ చికిత్స జరుగుతోంది. ఓ రోజు ఫిజియోథెరపిస్ట్ రాకపోవడంతో తనకి ఆ పని తెలుసు అని ఆ అమ్మాయే మసాజ్ చేసింది. అంతేతప్ప ఇందులో తన తప్పిదం ఏమీ లేదు. ఆ అమ్మాయిని తన బిడ్డలా భావించాను కానీ ఆమె ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు' అని గజల్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. గజల్ శ్రీనివాస్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే అతడిని కోర్టుకి తరలించారు. 

Trending News