GHMC fine: ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీని (TRS Plenary) పార్టీ వర్గాలు ఘనంగా నిర్వహించాయి. కరోనా సహా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ మూడేళ్ల తర్వాత నిర్వహించిన ప్లీనరీ కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయి పార్టీ వర్గాలు. హైటెక్స్‌లో (TRS Plenary in Hitex) జరిగిన ఈ ప్లీనరీకి కొన్ని రోజుల ముందు నుంచే హడావుడి నెలకొంది.
ప్లీనరీకి (TRS Plenary Flexies issue) సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, ప్రకటనలు దర్శనమిచ్చాయి. అయితే ఇందులో కొన్ని అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడంపై సామాజిక, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.
జీహెచ్ఎంసీపై ఆరోపణలు ఇలా..
గతంలో ఇలా ఎవరైనా అనుమతిలేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వెంటనే చర్యలు తీసుకున్న (GHMC) జీహెచ్ఎంసీ.. ఈ సారి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అంటూ పలువురు విమర్శలు చేశారు. అధికార పార్టీ అయినందుకే జరిమానాలు విధించడం లేదంటూ ఆరోపణలు కూడా వచ్చాయి.
బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఫ్లెక్సీలపై ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ విమర్శించారు.
పలు ప్రాంతాల్లో పోలీసుల సమక్షంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి.
Also read: Breaking: తెలంగాణలో ఉద్భవించనున్న మరో కొత్త పొలిటికల్ పార్టీ..
Also read: VVS Laxman political entry : త్వరలో బీజేపీలో చేరనున్న వీవీఎస్ లక్ష్మణ్?
జీహెచ్ఎంసీ వివరణ..
ఈ వివాదం నేపథ్యంలో జీహెచ్ఎంసీ గురువారం వివరణ ఇచ్చింది. ఈ నెల 21 నుంచి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) పోర్టల్ పని చేయలేదని.. ఈ కారణంగానే జరిమానా విధించలేకపోయినట్లు స్పష్టం చేసింది. తాజాగా వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినట్లు వెల్లడించింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఒక్కో ప్లెక్సీకి.. అందుకు బాధ్యులైన వారిపై (GHMC fine) రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించినట్లు కూడా పేర్కొంది.
జరిమానా నోటీసులు అందుకున్న వారిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (GHMC fine on Talasani Srinivas Yadv), హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు ఉన్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.
Also read: Dalit bandhu: దళిత బంధుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
Also read: Telangana inter Spot valuation: తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ తేదీలు
ప్లీనరీలో టీఆర్ఎస్ కీలక తీర్మానాలు..
ఈ ఏడాదితో టీఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్లు (TRS cross 20 Years) నిండాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్ (KCR elected as TRS president) వరుసగా 9వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆధ్యక్ష ఎన్నికతో పాటు.. వివిధ తీర్మానాలకు ప్లీనరీలో ఆమోదం లభించింది.
Also read: Mystery Deaths: జగిత్యాల జిల్లాలో విషాదం.. ఒకే చెరువులో ముగ్గురు యువతుల మృతదేహాలు
Also read: Yadadri temple: 3 కిలోల బంగారం విలువైన నగదు విరాళం ఇచ్చిన Minister Malla Redd
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook