GHMC Elections 2020 | గ్రేటర్ ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి అని తెలిపారు. అయినప్పటికి తెరాసకు మంచి ఆధిక్యత లభించింది అని తెలిపారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ తెరాసకు (TRS) ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరో 20-25 సీట్లు వస్తాయని ఊహించామని అయితే చిన్నపాటి మెజారిటీ , 200 ఓట్లతో కొన్ని చోట్ల ఓడిపోయాం అని తెలిపారు. మేము ఆశించినట్టు ఫలితాలు రాలేదు అనే స్పష్టం అని వెల్లడించారు కేటీఆర్.
Also Read | Telugu Memes: గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్, నెటిజెన్ల ట్రోలింగ్
గ్రేటర్ హైదరాబాద్ (GHMC) ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, నేతలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాంతో పాటు సోషల్ మీడియా వారియర్స్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు.
కొన్ని డివిజన్స్‌లో స్పల్ప మార్జిన్‌తో ఓడిపోయాం అని తెలిపారు కేటీఆర్. బీఎన్ రెడ్డి కాలనీలో 18 ఓట్లు, మౌలాలిలో 200 ఓట్లు, మల్కాజ్‌గిరిలో 70 ఓట్లు, మూసాపేట్‌లో 100 ఓట్లతో ఓడిపోయాం అని వెల్లడించారు. ఇలాంటి ఫలితాలు చూసి ఢీలా పడవద్దు అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తదుపరి మీటింగ్‌లో మేయర్ అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయిస్తాం అని ప్రకటించారు.
Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe