Hyderabad Traffic Police Advisory On Jubilee Hills Trial Run; జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివరణ ఇచ్చారు. అసలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రయాణ మార్గలను మార్పు చేయవలసిన అవసరం ఏమిటి? అని అంటూ మొదలు పెట్టి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సైబరాబాద్ నుండి వచ్చే ట్రాఫిక్ నేరుగా రోడ్డు నం.45 వద్దకు రావడం వలన రోడ్డు నం. 45 జంక్షన్ పై అధిక భారానికి దారితీస్తుందని, జూబ్లీహిల్స్ ప్రధాన జంక్షన్ లు అన్ని కూడా రోడ్. నెం.01 పై కేవలం 2.7 కి.మీ పరిధిలో ఉండటం కారణాలు అని పేర్కొన్నారు.
KBR పార్క్ రోడ్డు ఇరుకైన రోడ్డు కావడం మరియు KBR పార్క్ వైపు రోడ్డు విస్తరించే అవకాశం లేకపోవడం. రోడ్. నెం. 12 బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఒక జంక్షన్ క్లియర్ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుందని పేర్కొన్నారు. కేవలం 2.71 కి.మీ కారిడార్లో ప్రయాణించడానికి 25 నిమిషాల సమయం పడుతుందని అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇక నూతన మార్గాలలో ట్రాఫిక్ మళ్లించే ముందు ఏదైనా అధ్యయనం చేశారా? అంటే జంక్షన్లలో ట్రాఫిక్కు క్లియర్ చేయడానికి సిగ్నల్ సైకిళ్ల సంఖ్య, ట్రాఫిక్ రాకపోకల పరిమాణం, రోడ్ డిజైన్,. iv) రోడ్ నంబర్ 45 ద్వారా నగరాన్ని కలుపుతూ కొత్త రోడ్లు/వంతెనలు/ఫ్లై ఓవర్లు సైబరాబాద్ పరిధిలో నిర్మాణం కావడం వంటి విషయాల మీద అధ్యయనం చేశామని పేర్కొన్నారు.
ఇక ఈ రూట్లో జర్నలిస్ట్ కాలనీ జంక్షన్, BVB స్కూల్, రోడ్ నెం. 45లో హార్ట్ కప్ జంక్షన్, రోడ్ నెం. 45లోని జోజోజ్ రెస్టారెంట్, రోడ్ నెం. 45 జంక్షన్ లలో యూ తరుణ్ కల్పించామని పెర్కోన్నారు. ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి రోడ్ నెం. 12, బంజారాహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ 1. రోడ్ నెం. 45 జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ వద్ద రైట్ టర్న్ అనుమతించబడదని పేర్కొన్నారు. ఇక వారం రోజుల పాటు ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది, గ్రౌండ్ లెవల్ పరిస్థితిని రోజువారీగా సమీక్షించడం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు.
ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి దారి మళ్లించే రహదారుల వెంట అధికారులను నియమించారని, ప్రయాణీకుల అవగాహన కోసం అన్ని ప్రముఖ ప్రదేశాలలో సూచిక బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.. పొరులు ప్రయాణ సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626ను మరియు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ 8712660600 సంప్రదించవచ్చని కూడా పేర్కొన్నారు.
Also Read: Sitara Ghattamaneni Followers : మహేష్ కూతురా..మజాకా.. సితార రేర్ ఫీట్
Also Read: Samantha Hot Photos: వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న సమంతా...వీపంతా కనిపించేలా ఫోజులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook