Gold prices and silver rates: బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold prices and silver prices in Hyderabad: హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీలతో పాటు అనేక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2021, 12:34 PM IST
Gold prices and silver rates: బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold prices and silver prices in Hyderabad: హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీలతో పాటు అనేక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పెరిగిన ధరల విషయానికొస్తే.. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.44,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర (Gold rates) రూ. 110 మేర పెరిగి రూ.48,880 పలుకుతోంది. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు అనేక నగరాల్లో బంగారం ధరలు ఇంచుమించు ఇదే మోతాదులో పెరిగాయి.

వెండి ధరల (silver rates today Hyderabad) విషయానికొస్తే, హైదరాబాద్, విశాఖపట్నంలో వెండి ధరలు కిలోకు రూ. 100 మేర పెరిగింది. ధరల పెంపు అనంతరం ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.72,100 పలుకుతోంది. 

Also read : Gold and silver prices: తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు

ఇదిలావుంటే, మరోవైపు వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు (Gold and silver rates) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్‌కు 1797 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధరలు కూడా ఔన్స్‌కు 0.53 శాతం తగ్గి 25.18 డాలర్లకు పడిపోయింది.

Also read : Gas Cylinder Booking: ఆధార్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ లేకుండాన్ LPG గ్యాస్ సిలిండర్ కొత్త కనెక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News