రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెష్ చెప్పిన సీఎం, గవర్నర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Jan 1, 2018, 04:14 PM IST
రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెష్ చెప్పిన సీఎం, గవర్నర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో గడపాలని కోరుంటున్నట్లు చెప్పారు. 

తెలంగాణ గవర్నర్  ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మాట్లాడుతూ-  "తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో గడపాలని.. వారి కుటుంబాల్లో చిరునవ్వులు చిగురించాలని కోరుకుంటున్నా" అని ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ- "కొత్త సంవత్సరంలో ప్రజలంతా సఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018 సంవత్సరంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు" అని తెలిపారు. 

 

Trending News