Public money wasted: మంత్రి ప్రారంభించారు..మర్నాడే మూసేశారు

Public money wasted: ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించినా.. వాటిని పట్టించుకునే వారు లేక పాడవుతున్నాయి. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్లు హంగూ ఆర్భాటాలతో అట్టహాసంగా ఆ స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు. వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాట ఇచ్చారు. అయితే ఆ మరునాడు నుంచే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసేయడంతో అవాక్కవ్వడం జనం వంతైంది.

Written by - Attili | Edited by - Attili | Last Updated : May 28, 2022, 02:05 PM IST
  • జీహెచ్‌ఎంసీ నిధులతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం
  • మంత్రి ప్రారంభించిన మర్నాడు నుంచే మూసివేత
  • అధికారుల నిర్లక్ష్యంతో ప్రజా ధనం వృథా
Public money wasted: మంత్రి ప్రారంభించారు..మర్నాడే మూసేశారు

Public money wasted: ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించినా.. వాటిని పట్టించుకునే వారు లేక పాడవుతున్నాయి. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్లు హంగూ ఆర్భాటాలతో అట్టహాసంగా ఆ స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు. వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాట ఇచ్చారు. అయితే ఆ మరునాడు నుంచే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసేయడంతో అవాక్కవ్వడం జనం వంతైంది.

హైదరాబాద్‌  వనస్థలిపురంలోని రెడ్‌ ట్యాంక్ వెనకాల 3 కోట్ల రూపాయలు జీహెచ్‌ఎంసీ నిధులతో అన్ని హంగులతో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. రెండు సంవత్సరాల క్రితమే నిర్మాణ పనులు చేపట్టినా కరోనా కారణంగా గత ఏడాది ఈ స్విమ్మింగ్ పూల్‌ను అందుబాటులోకి తేలేకపోయారు. కొవిడ్ తగ్గుముఖం పట్టాకా..నిర్మాణ పనులు పూర్తి చేసి మే 11న మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, దయానంద్ తదితరలు హాజరయ్యారు.

మర్నాడు అంటే మే 12 నుంచి ఈ స్విమ్మింగ్ పూల్ జనానికి అందుబాటులోకి తెస్తామని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించారు. మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సమయంలో ఈట కొట్టడానికి ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకున్నారు. అయితే సీన్ కట్‌ చేస్తే.. మరుసటి రోజు నుంచి ఈత కోసం వెళ్లిన వారికి మూసి ఉన్న గేట్లు స్వాగతం పలికాయి. ఎప్పుడొచ్చినా.. రేపు రా మాపు రా అంటూ పూల్ సిబ్బంది చెప్పడంతో జనం విసిగిపోయారు. ప్రారంభించిన మరుసటి రోజు నుంచే స్విమ్మింగ్ పూల్‌ను మూసివేయడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయనీ అందుకే అందుబాటులోకి రాలేదని కొందరు.. కోచ్,అసిస్టెంట్ కోచ్‌లు లేరని ఇంకొందరు.. పూల్‌లో నీటిని ల్యాబ్‌కు పంపామనీ.. రిపోర్టు రాగానే ఓపెన్ చేస్తామంటూ మరికొందరు సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. సమ్మర్‌ ముగిసే లోపు కొన్ని రోజులైనా స్విమ్మింగ్ పూల్ ఉపయోగించుకుందామని భావించిన సామాన్య జనానికి మాత్రం నిరాశే ఎదురైంది. ఎప్పటి నుంచి ఈతకొలనును ప్రారంభిస్తారో చెప్పకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసినవి ఇలా నిరుపయోగంగా పడి ఉండటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Telugu Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి ఎప్పుడు.. చైత్ర మాసంలోనా.. వైశాఖ మాసంలోనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4GApple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News