Telugu Hanuman Jayanti 2022 : హనుమంతుడు ఎప్పుడు జన్మించాడు ? ఆంజనేయుడి జయంతి ఏ రోజు జరుపుకోవాలి ? చాలా మందిలో ఈ సంశయం నెలకొంది. ఇందుకు కారణం ప్రతి ఏటా హనుమాన్ జయంతి పేరుతో రెండు సార్లు వేడుకలు జరగటమే. ఉత్తరాదిలో హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే రోజు హనుమాన్ జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి.. హనుమంతుడి జయంతిగా కాక హనుమాన్ విజయోత్సవంగా పండితులు చెబుతుంటారు.
సీతా, లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడి వసవాసం.. సీతాపహరణం, లంకా దహనం, వారది నిర్మాణం, రావణ సంహారం ఇలా రామాయణ ఘట్టాలు మనకు తెలిసినవే. సీతా దేవిని రావణుడు అపహరించాకా.. శ్రీరాముడు శోకభరితుడవుతాడు. ఆయన దుఃఖాన్ని నివారించేందుకు సముద్రాన్ని లంఘించిన హనుమంతుడు.. సీతా దేవి జాడ కనిపెడతాడు. ఆ తర్వాత వాహనులతో లంకపై దండెత్తిన శ్రీరాముడు.. రావణుడిని వధించి సీతాదేవికి తిరిగి పొందుతాడు. సీతారాములు తిరిగి అయోధ్య చేరుకున్నాకా..లంకలో రావణుడిపై విజయానికి ఆంజనేయుడే కారణమని ప్రకటించి.. హనుమాన్ విజయోత్సవం నిర్వహించాడట. ఆ రోజు చైత్ర పౌర్ణమి. అందుకే అప్పటి నుంచి హనుమాన్ విజయోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అయితే అదే కాల క్రమంలో హనుమాన్ జయంతిగా మారిందంటున్నారు.
మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయుడు అసుర సంహారం చేశాడనీ.. అందుకే ఆ రోజు వేడుకలు జరుపుకుంటారని చెబుతారు.
హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు ?
వైశాఖ బహుళ దశమి నాడు అంజనా దేవీ గర్భాన ఆంజనేయుడు జన్మించాడని పరాశర సంహిత చెబుతోంది. కేసరి, అంజనా దేవిల కుమారుడిగా... శివాంస సంభూతుడిగా జన్మించాడు. సప్త చిరంజీవుల్లో ఆయన ఒకరు. ఇప్పుటికీ మారుతి జీవించే ఉన్నాడని శాస్త్రాలు చెబుతాయి. రామభక్తులడైన అంజనా పుత్రుడు భక్త సులభుడంటారు. భక్తితో రామనామ జపిస్తే చాలు.. ఆంజనేయుడు ప్రసన్నుడవుతాడు. యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ అని పెద్దలు చెబుతారు. అంటే రామ కీర్తన జరిగే చోట హనుమంతుడు అంజలి జోడించి ఉంటాడు.
హనుమాన్ జయంతి ఎలా జరుపుకోవాలి :
చైత్ర పౌర్ణమి మొదలుకొని వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల పాటు కొందరు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. 1, 5, 11, 41 ఇలా వీలైన సంఖ్యను ఎంచుకుని సంకల్పం చెప్పుకుని పారాయణ చేస్తే అనుకున్న కార్యాలు నెరవేరతాయని నమ్మకం. ఇక హనుమాన్ జయంతి (Hanuman Jayanti 2022) నాడు ... షోడశోపచార పూజలతో ఆంజనేయుడిని అర్చిస్తే సమస్త శుభాలు కలుగుతాయి, శని బాధలు తొలగిపోతాయి. మారుతికి అరటి పండ్లు, అప్పాలు అంటే మిక్కిలి ఇష్టం. వాటిని నివేదిస్తే అమితానందభరితుడవుతాడు.
Also read: Tuesday Remedies: పేదరికం, అప్పుల నుండి బయటపడాలంటే.. మంగళవారం ఈ పనులు చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.