Harish Rao: మంత్రి హరీశ్ రావు ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత... అడ్డుకున్న బీజేపీ శ్రేణులు..

Minister Harish Rao Khammam Visit: తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు నిరుద్యోగుల నిరసన సెగ తగులుతోంది. తాజాగా మంత్రి హరీశ్ రావు ఖమ్మంలో పర్యటించగా.. ఉద్యోగ నోటిఫికేషన్లకు డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 04:34 PM IST
  • మంత్రి హరీశ్ రావు ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత
  • కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
  • ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని బీజేపీ శ్రేణుల డిమాండ్
Harish Rao: మంత్రి హరీశ్ రావు ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత... అడ్డుకున్న బీజేపీ శ్రేణులు..

Minister Harish Rao Khammam Visit: ఖమ్మం జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్‌ల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రుల కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డగించే ప్రయత్నం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా మంత్రులు జిల్లాలో పర్యటించడం సిగ్గుచేటని విమర్శించారు. 

ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం నిమిత్తం మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు ఇవాళ అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన క్యాథ్‌ల్యాబ్, ట్రామాకేర్ విభాగాన్ని ప్రారంభించారు.  అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా హెల్త్, ట్రెజరీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  అక్కడి నుంచి ఆత్కూరు చేరుకుని.. స్థానిక ఏర్పాటు చేసిన హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.

అనంతరం మధిరలో వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి హరీశ్ శంకుస్థాపన చేయనున్నారు. శనివారం (జనవరి 29) సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పాల్వంచలో నిర్మితమవుతున్న నర్సింగ్, మెడికల్ కాలేజీ పనులను మంత్రి పరిశీలించనున్నారు.

ఉస్మానియాలోనూ టీఆర్ఎస్‌కు నిరుద్యోగుల సెగ :

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోనూ టీఆర్ఎస్‌కు నిరుద్యోగుల సెగ తగిలింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ (CM KCR) జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇవాళ్టి (జనవరి 28) నుంచి ఉస్మానియా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు ఆ ఫ్లెక్సీలను చించి దగ్ధం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను క్యాంపస్‌లో అడుగుపెట్టనివ్వమని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

Also Read: Jagtial: బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటు.. జగిత్యాల మహిళ మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News