Pawan Kalyan: బిగ్ ట్విస్ట్.. దాసోజు శ్రవణ్‌కు పవన్ కళ్యాణ్ సపోర్ట్.. బీజేపీ-జనసేన కటీఫ్ కన్ఫార్మ్..?

Pawan Kalyan on Dasoju Sravan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌కు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా బీజేపీని తిట్టిన ఆయనను పొగడ్తలతో ముంచారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 05:59 PM IST
  • దాసోజు శ్రవణ్‌పై పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం
  • ఆయన ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి కోసం పోరాడుతారు
  • చర్చనీయాశంగా మారిన జనసేనాని కామెంట్స్
Pawan Kalyan: బిగ్ ట్విస్ట్.. దాసోజు శ్రవణ్‌కు పవన్ కళ్యాణ్ సపోర్ట్.. బీజేపీ-జనసేన కటీఫ్ కన్ఫార్మ్..?

Pawan Kalyan on Dasoju Sravan: మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి చేరిన నేతలకు మళ్లీ గాలం వేస్తూ.. తిరిగి పార్టీలోకి రప్పిస్తున్నారు. ఇటీవలె బీజేపీలోకి చేరిన దాసోజు శ్రవణ్.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అధికార టీఆర్ఎస్ గూటికి చేరునున్నారు.

దాసోజు శ్రవణ్ రాజీనామాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. డైనమిక్, దూరదృష్టి గల నాయకుడు దాసోజు శ్రవణ్ అంటూ పొగిడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పీఆర్పీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారని.. ఆయన ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పోరాడుతారని అన్నారు. శ్రవణ్ నిజమైన స్థాయి ఏంటో ఇప్పడు అందరికీ అర్థం అవుతుందని జనసేనాని పేర్కొన్నారు. తన స్నేహితుడైన శ్రవణ్.. భవిష్యత్‌లో ఉన్నత విజయాలు అందుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పవన్ కళ్యాణ్ పేరుతో ట్వీట్స్ చేశారు.

బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. ఆ పార్టీకి రాజీనామా చేసిన నేతకు మద్దతుగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలె టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసి పవన్.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో కలిసే అవకాశం ఉండడంతో బీజేపీతో కటీఫ్ అనే ప్రచారం జోరుగా సాగింది.

నేడు బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ను పవన్ ప్రశంసించడం వెనుక ఆంతర్యం ఏమిటో మరి. తెలంగాణలో జనసేన యాక్టివ్‌గా లేకపోయినా.. పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. బీజేపీతో జనసేన కటీఫ్ దాదాపు కన్ఫార్మ్ అయిపోయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అటు ఏపీ.. ఇటు తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతుండడంతో.. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన దాసోజు శ్రవణ్.. 2009లో సికింద్రాబాద్ నుంచి ఆ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే 2014లో తనకు టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్‌కు రాంరాం చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లోనూ కీలక నేతగా వ్యవహరించిన ఆయన.. రెండు నెలల క్రితమే కాషాయ కండవా కప్పుకున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో బీజేపీకి కూడా గుడ్ బై చెప్పేశారు. 

Also Read: TRS OPERATION AKARSH: నేరుగా గ్రౌండ్ లోకి దిగిన సీఎం కేసీఆర్.. కారెక్కనున్న ఉద్యమ లీడర్లు?

Also Read: Indian Army helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News