Heavy rain fall various places in Hyderabad: తెలంగాణలో రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో బలమైన ఈదురు గాలులతో పాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలపింది. అదే విధంగా ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే వర్షాలు అవకాశం వుందని హైదరబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అచ్చం వెదర్ రిపోర్ట్ ప్రకారమే.. ఉదయం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలలో వాతావరణం చల్లబడింది.
#Hyderabadrains 🌧️⚠️ pic.twitter.com/qNrbehAr8u
— Hyderabad Rains (@Hyderabadrains) July 14, 2024
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మేఘాలు వచ్చేశాయి. సాయంత్ర వేళ చాలా ప్రాంతాలలో చినుకులు పడటం స్టార్ట్ అయ్యింది. అదే విధంగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం కురవడం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. వీకెంట్ కావడం, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ తోసరదాగా గడిపేందుకు వెళ్లిన వాళ్లు వర్షంలో తడిసి ముద్దైపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రోడ్లన్ని జలమయమైపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పటినట్లు తెలుస్తోంది.
శనివారం కావడంతో, కాస్త రద్దీ తక్కువగానే ఉన్నా.. చాలా చోట్ల మాత్రం ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. నల్లకుంట, లింగంపల్లి, నారాయణ్ గూడ, గాంధీనగర్, అశోక్ నగర్, సోమాజిగూడ, రాజ్ భవన్, హైటెక్ సిటీ, దిల్ సుఖ్ నగర్ కొత్తపేట, అమీర్ పేట, నల్లగంట్ల, తెల్లపూర్, చందానగర్, కూకట్ పల్లి వంటి మొదలైన ప్రాంతాలలో వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది.
వర్షాలు పడుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతేనే బైటకు రావాలని సూచించారు. కరెంట్ తీగలు ఎక్కడైన గాలికి పడిపోతే..వెంటనే అధికారులకు సమాచారంఇవ్వాలని, ఎలక్ట్రిక్ పోల్ లను తాకొద్దంటూ కూడా పలు సూచనలు చేశారు. మ్యాన్ హోల్స్ తో అప్రమత్తంగా ఉండాలని, నాలాలతో అలర్ట్ గా ఉండాలని కూడా బల్దియా సిబ్బంది సూచించారు. రోడ్డుమీద ట్రాఫిక్ కు ఇబ్బంది కల్గించే పనులుచేయోద్దని కూడా పోలీసులు సూచనలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి